Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Sridevi Soda Center 5th day Collections: బాక్సాఫీస్ వద్ద పరిస్థితి దారుణంగానే.. లాభాల్లోకి రావాలంటే?
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో భారీగా థియేటర్లలోకి వచ్చిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్టు 27న రిలీజైన ఈ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. తొలి ఆట నుంచే మంచి వసూళ్లను, అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసుకొన్నది. వారాంతం తర్వాత ఈ సినిమా వసూళ్లు కాస్త తడబాటు కనిపించింది. ఈ సినిమా 5వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

మహేష్ బాబు ప్రశంసలు
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇటీవల చిత్ర నిర్మాత, దర్శకులు, హీరో సుధీర్ బాబును కలిసి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు నటన కెరీర్ బెస్ట్ అంటూ కితాబిచ్చారు. అలాగే సామాజిక ఇతివృత్తంతో సినిమాను రూపొందించిన దర్శకుడు కరుణా కుమార్, నిర్మాతను కూడా ప్రశంసించారు.
Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

సుధీర్ బాబు టీమ్ జైత్రయాత్ర
ప్రస్తుతం సినిమాపై ప్రేక్షకుల కనబరుస్తున్న స్పందన నేపథ్యంలో హీరో సుధీర్ బాబు, దర్శకుడు కరుణ కుమార్‌తో తమ చిత్ర యూనిట్‌తో కలిసి ఆంధ్రాలో విజయయాత్రను చేపట్టారు. ఈ క్రమంలో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక ఐదో రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

శ్రీదేవీ సోడా సెంటర్ 5వ రోజు కలెక్షన్లు
శ్రీదేవి సోడా సెంటర్ ఐదో రోజున నైజాంలో రూ.8 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 3 లక్షలు వసూలు చేసింది. అలాగే ఆంధ్రాలోని ప్రధానమైన జిల్లాలలో తూర్పు గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.6 లక్షలు, గుంటూరులో రూ.2.2 లక్షలు, కృష్ణా రూ.1.7 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ. 1. 3 లక్షలు వసూలు చేసింది. ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో 23 లక్షలు నికర, 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Ananya Nagalla : అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా.. బొద్దుగా vs ముద్దుగా!

5 రోజులు మొత్తం కలెక్షన్లు
ఇక మొత్తం ఐదు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.1.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 60 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.46 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 34 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 19 లక్షలు, గుంటూరు జిల్లాలో 37 లక్షలు, కృష్ణ జిల్లాలో 21 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఐదు రోజల్లో రూ.3. 58 కోట్లు నికరంగా, రూ.5.82 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Recommended Video

ప్రాఫిట్స్‌లోకి రావాలంటే..
ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా రూ.8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 20 లక్షలు నమోదు చేసింది. దీంతో మొత్తంగా రూ.3.86 కోట్లు నికరంగా, రూ.6.50 కోట్లు గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఈ చిత్రం మొత్తంగా 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. మొత్తంగా రూ.8.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 4.5 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ చిత్రం లాభాల్లోకి వస్తుందా అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.