twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SSMB28: త్రివిక్రమ్ - మహేష్ సినిమా బిజినెస్ లెక్కలు మామూలుగా లేవు.. అప్పుడే బేరాలు షురూ!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కాంబినేషన్ గా తెరపైకి రాబోతున్న మహేష్ బాబు SSMB 28 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న మూడవ సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ కూడా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అయితే మార్కెట్లో కూడా ఈ సినిమాకు రోజురోజుకు డిమాండ్ గట్టిగానే పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా నిర్మాతలు బేరాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక ఒక్కో ఏరియాకు నిర్మాతలు ప్రస్తుతం ఎంత మేరకు కోట్ చేస్తున్నారు అనే వివరాల్లోకి వెళితే..

    ఫైనల్ గా మొదలైంది.

    ఫైనల్ గా మొదలైంది.

    త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకుముందు అల్లు అర్జున్ తో చేసిన అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా సక్సెస్ అనంతరం మహేష్ బాబుతో సినిమా చేయాలి అని త్రివిక్రమ్ గత రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు. ఇక మొత్తానికి ఈ కాంబినేషన్ ఇటీవల పట్టాలు ఎక్కేసింది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీక్ చేయాలని టార్గెట్ అయితే సెట్ అయ్యింది.

    ఓవర్సీస్ లో..

    ఓవర్సీస్ లో..

    అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైందో లేదో నిర్మాత సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ హౌస్ కు కొంతమంది బయ్యర్లు కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే నిర్మాతలు నుంచి కొన్ని ఏరియాలకు సంబంధించిన కోట్ చేస్తున్న రేట్ల విధానం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు 23 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట.

     ఏ ఏరియాలో ఎంత రావచ్చు?

    ఏ ఏరియాలో ఎంత రావచ్చు?

    ప్రస్తుతం అయితే ఏ ఏరియా డీల్ అయితే క్లోజ్ కాలేదు కానీ నిర్మాతలు మాత్రం ప్రతి ఏరియా నుంచి ఇంత వస్తుంది అని ఒక రేటును అయితే అంచనా వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నైజం ఏరియాలో ఈ సినిమాకు దాదాపు 45 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశం ఉందట. ఇక ఆంధ్రలో కూడా 50 కోట్లు ఉండవచ్చు అని సీడెడ్ లో మరో 20 కోట్ల రేంజ్ లో లెక్క ఉండవచ్చు అని తెలుస్తోంది.

    డిజిటల్ హక్కులు

    డిజిటల్ హక్కులు

    ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ రూపంలో ఈ కాంబినేషన్ దాదాపు 100కోట్లు వెనక్కి తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక టాప్ ఓటీటీ సంస్థ దాదాపు అన్ని భాషలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

     హిందీ వెర్షన్

    హిందీ వెర్షన్

    ఇక హిందీ వెర్షన్ లో ఈ సినిమాను విడుదల చేస్తారా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. షూటింగ్ కొనసాగుతున్న తర్వాత కాలాన్ని బట్టి ఆలోచిస్తారట. ఇక ప్రస్తుతం అయితే హిందీ డబ్బింగ్ హక్కుల కోసం దాదాపు 30 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్ పరంగా కూడా ఈ సినిమాకు ఏడు కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    టోటల్ బిజినెస్ ఎంత ఉండొచ్చంటే?

    టోటల్ బిజినెస్ ఎంత ఉండొచ్చంటే?

    ఇక మొత్తంగా చూసుకుంటే SSMB 28 ప్రాజెక్ట్ పై నిర్మాతలు పెట్టిన పెట్టుబడి కంటే విడుదలకు ముందే భారీ స్థాయిలో టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు 150 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందట. ఇక నాన్ థియేట్రికల్ గా మరొక 140 కోట్ల బిజినెస్ చేస్తే.. మొత్తంగా అయితే 280 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేయవచ్చని సమాచారం. ఇక మహేష్ బాబు అయితే ఈ సినిమాకు 70 నుంచి 75 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నట్లు టాక్.

    English summary
    SSMB28 project producers expected pre release bussiness details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X