»   » 'భలే మంచిరోజు' గురించి సుధీర్ బాబు లేటెస్ట్ గా...

'భలే మంచిరోజు' గురించి సుధీర్ బాబు లేటెస్ట్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుధీర్‌ బాబు హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భలే మంచిరోజు'. ఈ చిత్రం ఆడియోని ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. తన కెరీర్ లోనే బెస్ట్ ఆడియో ఇచ్చారని సుధీర్ బాబు ట్వీట్ చేసారు. అలాగే ఆడియో అందరికీ నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై విజయ్‌, శశి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' ఫేమ్‌ సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.


Sudheer Babu's BhaleManchiRoju audio in this month

నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర మొదటి పోస్టర్‌ని విడుదల చేశాం. ఒకమ్మాయి చైర్‌లో కూర్చోవటం, బల్బ్‌ వెలుగుతూ పక్కనే హీరో సుధీర్‌బాబు నిలబడి ఉండటం ఇలా చాలా వైవిధ్యంగా ఉండే పోస్టర్‌ను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశాం . దీనికి మంచి స్పందన వస్తోంది. రెండో పోస్టర్‌ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశాం. ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న సబ్జెక్ట్‌ అనుకున్నట్టుగానే తెరకెక్కించాం. సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కథ, కథనాలని నమ్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధీర్‌ బాబు పరకాయ ప్రవేశంలా ఇన్‌వాల్వ్‌ అయ్యి మరీ నటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని'' అని అన్నారు.


కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.


English summary
Sudheer Babu ‏ tweeted "BhaleManchiRoju audio will be released in this month.sunny m r is done the music n it's my career best music guys.u ppl will love it"
Please Wait while comments are loading...