Sundarakanda Collections: సుందరకాండ బాక్సాఫీస్ కలెక్షన్లు.. బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి?
యువ హీరో నారా రోహిత్, సీనియర్ హీరోయిన్ శ్రీదేవీ విజయ్ కుమార్, నూతన నటి వ్రితీ వఘానీ నటించిన సుందరకాండ చిత్రం ఆగస్టు 27వ తేదీ వినాయకచవితి పండుగ కానుకగా రిలీజైంది. ఈ చిత్రంలో వీకే నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అభినవ్ గోమటం, సిరి లేళ్ల, వీటీవీ గణేష్, అజయ్, రూపాలక్ష్మీ, సునైనా, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్.. తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం, ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫిని, రోహన్ చిల్లాలే ఎడిటింగ్, రాజేశ్ పెంటకోట ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్డెట్ సుమారుగా 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమాకు 8 కోట్ల రూపాయలు థియేట్రికల్ బ్రేక్ ఈవెన్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 8 కోట్ల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సుందరకాండ సినిమా ప్రీమియర్లను ఆగస్టు 26వ తేదీన గ్రాండ్‌గా ప్రదర్శించారు. అమెరికాతోపాటు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో స్క్రీనింగ్ చేశారు. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ల తర్వాత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ సానుకూలంగా మారుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కావడం వల్ల ప్రేక్షకులందరూ పండగ పనుల్లో బిజీగా ఉండటం, ఏపీ, నైజాంలో వర్షాలు భారీగా కురవడంతో తొలి రోజు ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 శాతం ఆక్యుపెన్సీ నమోదైందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఈ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్లు కూడా అంత ఆశాజనకంగా కనిపించలేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల అందుకు ఓ కారణం కాగా.. ఈ సినిమాకు మౌత్ టాక్ పెరిగితే.. శుక్రవారం నుంచి బాక్సాఫీస్ పుంజుకొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ సినిమాకు నార్త్ అమెరికాలో అత్యంత స్వల్పంగా కలెక్షన్లు నమోదు అయ్యాయని సోషల్ మీడియాలో ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాను అమెరికాలో ప్రత్యాంగీరా సినిమాస్ రిలీజ్ చేసింది. అధికారికంగా వారు కలెక్షన్ల వివరాలను ప్రకటిస్తారా? అనేది వేచి చూడాల్సింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా స్లోగా కలెక్షన్ల జర్నీని మొదలుపెట్టింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో ఈ సినిమా ఓ మాదిరగా టికెట్లు తెగాయి. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్‌ను చూస్తే.. తక్కువే అని అంటున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సుమారుగా 50 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇతర ప్రాంతాల్లో వసూళ్లు, నార్త్ అమెరికాలో కలిపి ఈ మూవీ సుమారుగా 70 లక్షల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











