ఖరారు చేస్తూ సందీప్ కిషన్ ట్వీట్ చేసాడు
హైదరాబాద్: సందీప్ కిషన్, సీరత్‌కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'టైగర్'. రాహుల్ రవీంద్రన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. 'టైగర్' చిత్రానికి వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ఈ చిత్రం కాశీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథని.. అదే విధంగా వినోదానికి ప్రాధాన్యం ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్ అన్నారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ విషయమై సందీప్ కిషన్ ఇలా ట్వీట్ చేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రవిశేషాలను ఎన్వీ ప్రసాద్ చెబుతూ - "ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.
‘ఠాగూర్' మధు మాట్లాడుతూ - "ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. 26న అత్యధిక థియేటర్లలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం" అన్నారు.

తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.


Click it and Unblock the Notifications











