twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్ముడేనట.. తొలి రోజు ఎన్ని కోట్ల వసూళ్లంటే!

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నర్సింహారెడ్డి చిత్రం రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగడంతో సినిమాపై అంచనాలు ఊహకు అందని విధంగా పెరిగాయి. రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం భారీగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? తొలి రోజు ఎంత మేరకు వసూళ్లు సాధించవచ్చు అనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

    తెలుగు రాష్ట్రాల్లో..

    తెలుగు రాష్ట్రాల్లో..

    ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.106 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.28 కోట్లు, సీడెడ్‌లో రూ.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇక టాక్ బాగుంటే తొలివారాంతంలోనే ఈ చిత్రం రికార్డులు తిరగరాసి.. లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

    ఆంధ్రా ప్రాంతంలో

    ఆంధ్రా ప్రాంతంలో

    ఇక ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.30 కోట్లకుపైగానే జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రూ.10 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.10 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.8.4 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.11.2 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.5.2 కోట్ల మేర జరిగింది. అయితే తొలి వారాంతంలోనే ఈ మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా రూ.187 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక సైరా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంటే.. రికార్డులు చెల్లాచెదరు కావడం సులభమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా రూ.50 కోట్ల షేర్, ఓవర్సీస్‌లో మరో రూ.10 కోట్ల షేర్ కలుపుకొని భారీ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    దక్షిణాదిలో...

    దక్షిణాదిలో...

    ఇక సైరా సినిమా దక్షిణాది రాష్టాల్లో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. కర్ణాటకలో తెలుగు వారు ఎక్కువగానే ఉండటంతో సుమారు 7 కోట్ల వసూళ్లను తొలి రోజు వసూలు చేస్తాయని అంటున్నారు. ఇక కేరళ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ఊహించని కలెక్షన్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Megastar chiranjeevi syera movie audio function is on September 18th. Pawankalyan attending as chief guest. But telangana state it minister ktr will not attend event. This movie produced by ramcharan and directed by surender reddy. First day collections, will be around Rs70 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X