Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వరుణ్ తేజ్ సినిమాను దాటలేకపోయిన సైరా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్న చిరు
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తాజాగా ఓ మైలురాయిని చేరుకుంది. అయితే, ఈ ఘనత సాధించిన మూడో చిత్రంగా మాత్రమే రికార్డులకెక్కింది. ఇంతకీ ఏంటా మైలురాయి..? వివరాల్లోకి వెళితే...

ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఇదే
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కానీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఒక్క తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ‘సైరా' అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఊహించని కలెక్షన్లు
‘సైరా: నరసింహారెడ్డి' సినిమా విడుదలైన రోజు మంచి టాక్ సంపాదించింది. అదే సమయంలో కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది. అయితే, సినిమా బిజినెస్ ముగిసే సమయానికి మాత్రం ఊహించని కలెక్షన్లు రాబట్టింది. అంటే.. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలు, ప్రాంతాలను కలిపి మొత్తంగా రూ. 130 కోట్లు షేర్ దక్కించుకుంది. అలాగే, రూ. 300 కోట్లు గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది
‘సైరా: నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం, ఏపీలో రూ.107.4 కోట్లు, కర్ణాటకలో రూ.27 కోట్లు, తమిళనాడులో రూ.7.6 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, మిగితా దేశాల్లో రూ.27.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు పలికింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. అయితే, ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.

వరుణ్ తేజ్ సినిమాను దాటలేదు
తాజాగా ‘సైరా' యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 33 సెంటర్లలో మాత్రమే ఈ ఫీట్ సాధించింది. దీంతో 2019లో విడుదలైన సినిమాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ‘సైరా' కంటే ముందు మహేశ్ నటించిన ‘మహర్షి' 110 సెంటర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, వరుణ్ తేజ్ - వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘F2' 65 సెంటర్లతో రెండో స్థానంలో ఉంది. ఇక, సైరా తర్వాత సమంత - నాగ చైతన్య నటించిన ‘మజిలి' 25 సెంటర్లతో నాలుగో స్థానంలో ఉంది.
Recommended Video

సైరా: నరసింహారెడ్డి గురించి
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించాడు. ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.