»   » లాభాల పంట: బడ్జెట్ 31 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు

లాభాల పంట: బడ్జెట్ 31 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 31 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 145 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లను అందుకోబోతోంది.

సినిమాకు ఈ రేంజిలో కలెక్షన్లు రావడం చూసి అటు నిర్మాత క్రిషిక్ లుల్లా సైతం ఆశ్చర్య పడుతున్నారు. త్వరలోనే మా చిత్రం ‘దబాంగ్-2' 158 కోట్ల రికార్డును అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల ప్రకారం.... బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన 12వ చిత్రం ‘తను వెడ్స్ మను రిటర్న్స్' రికార్డులకెక్కింది.

Tanu weds Manu collections Rs 145 crores

రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో మాధవన్ నటించిన ‘తను వెడ్స్ మను' చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా తాజాగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తయింది. ఈ చిత్రం సాధించిన లాభాల శాతం 368%గా నమోదైంది.

English summary
The sequel to Tanu Weds Manu starring Kangana Ranaut and R Madhavan is now Bollywood's 12th biggest hit of all times in the domestic market.
Please Wait while comments are loading...