Just In
- 7 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 24 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 40 min ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
Don't Miss!
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Finance
గుడ్‌న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్: ‘టాక్సీవాలా’ జోరు... ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డీలా!

విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో రూపొందిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమా కంటే ఒక రోజు ముందు విడుదలైన రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా వెనకబడిపోయింది.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయానికొస్తే.... మూడు రోజల్లో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సాధించిన కలెక్షన్ల కంటే రెండు రోజుల్లో 'టాక్సీవాలా' రాబట్టిన వసూళ్లే ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నారు.

రవితేజ-శ్రీను వైట్ల మూవీ
రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నవంబర్ 16న దాదాపు 750 స్క్రీన్లలో విడుదల చేశారు. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.70 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వసూళ్లు రవితేజ గత ప్లాప్ మూవీ ‘నేల టిక్కెట్' మూవీ తొలి రోజు వసూళ్లతో సమానం.

అమర్ అక్బర్ ఆంటోనీ ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్
దర్శకుడు శ్రీను వైట్ల వరుసగా మరోసారి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. సినిమా మౌత్ టాక్ సైతం నెగెటివ్‌గా ఉండటంతో రెండో రోజు నుంచి కలెక్షన్స్ మరింత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీరెండ్ మూడు రోజులు కలిపి ‘అమర్ అక్బర్ ఆంటోనీ' రూ. 12 కోట్ల గ్రాస్ మించలేదని అంటున్నారు.

రవితేజ మూవీ లాభాల్లోకి రావాలంటే..?
‘అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 22 కోట్లకు అమ్మారు. సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే.... రూ. 22 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. ఫస్ట్ వీకెండ్ సమయానికి రూ. 6 కోట్లకు మించి షేర్ రాలేదని తెలుస్తోంది.

దూసుకెళుతున్న ‘టాక్సీవాలా'
శనివారం విడుదలైన ‘టాక్సీవాలా' మూవీ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెలుతోంది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్లతోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
|
‘టాక్సీవాలా' ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్
మొదటి రోజు రూ. 10.5 కోట్ల గ్రాస్ సాధించిన ‘టాక్సీవాలా'... పాజిటివ్ మౌత్ టాక్ కారణం ఆదివారం వసూళ్లు మరింత పెరిగాయి. ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్న్ రూ. 22 కోట్లకు రీచ్ అయినట్లు తెలుస్తోంది. సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఎక్స్‌ట్రా స్క్రీన్లు కూడా యాడ్ చేశారట.