»   » టాక్ ఎఫెక్టు :'హోరా హోరీ’ కి 15 నిముషాల కోత

టాక్ ఎఫెక్టు :'హోరా హోరీ’ కి 15 నిముషాల కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా ఫ్లాఫ్ టాక్ వస్తే వెంటనే మనవాళ్లు దాని లెంగ్త్ తగ్గించి వదిలే కార్యక్రమం మొదలెడతారు. అయితే ఈ చర్యలు సాధారణంగా ప్రభావం చూపించిన ధాకలాలు కనపడవు. మొన్న శుక్రవారం దర్శకుడు తేజ చిత్రం 'హోరా హోరీ' విడుదలైంది. ఈ చిత్రం మార్నింగ్ షో కే బోర్ సినిమాగా టాక్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు సినిమాలో 15 నిముషాలు కట్ చేసి వదులుతున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


డి.సురేష్ బాబు సమర్పణలో రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘హోరా హోరీ'. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందింది. ‘చిత్రం', ‘నువ్వు-నేను', ‘జయం' వంటి సూపర్ హిట్ ప్రేమకథలను డైరెక్ట్ చేసిన తేజ చిత్రాన్ని మరో సున్నితమైన ప్రేమకథగా తెరకెక్కించారు.


Teja's Hora Hori trimmed by 15 minutes

సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉండటంతో సినిమా ఆర్ట్ సినిమాలా అనిపిస్తుందని కొందరు అభిమానులు, ప్రేక్షకులు తెలియజేయడంతో ఇప్పడు చిత్రాన్ని 15 నిమిషాల పాటు ట్రిమ్ చేసి కథలో వేగాన్ని పెంచారు. ఇప్పుడు సినిమా ఫుల్ స్పీడ్ తో కమర్షియల్ పంథాలో ఉంటుందని చిత్రయూనిట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ చిత్రం ట్రిమ్ వెర్షన్ ఈరోజు నుండే అన్నీ థియేటర్స్ లో ప్రదర్శితమవుతుందని కూడా తెలియజేశారు.


సోషల్ మీడియా ద్వారా ‘హోరా హోరీ' సినిమాపై నెగెటివ్ టాక్ వైరల్ లా స్ప్రెడ్ అయింది. కొందరయితే తేజ తన సినిమాతో ప్రేక్షకులను టార్చర్ పెట్టారంటూ మండి పడ్డారు. మరికొందరు సినిమా మొత్తం థియేటర్లో కూర్చొని చూసే విధంగా లేదని, మధ్యలోనే లేచి వచ్చామంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తేజకు ‘హోరా హోరీ' నెగెటివ్ టాక్ పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం సినిమాపై పాజిటివ్ గానే స్పందించారు.

English summary
Sri Ranjith movies and director Teja teamed up make a love story called Hora Hori. Director Teja has always introduced new talent to the film industry and he continued his tradition with this new venture. But it get Flop talk and now makers trimmed by `15 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu