»   » మిలియన్ డాలర్ మార్కును అధిగమించిన ‘టెంపర్’

మిలియన్ డాలర్ మార్కును అధిగమించిన ‘టెంపర్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా మార్కెట్ ఒకప్పుడు కేవలం ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాల్లో మాత్రమే పరిమితం అయి ఉండేది. అయితే తెలుగు వాళ్లంతా ఎక్కువగా సెటిలైన యూఎస్ఏ కూడా తెలుగు సినిమాలకు ప్రధానమైన మార్కెట్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ తెలుగు సినిమా 1 మిలియన్ డాలర్ మార్కు అందుకోవడం అంటే గొప్ప విషయమే.

తాజాగా జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ 1 మిలియన్ మార్కను దాటింది. యూఎస్ఏలో 1 మిలియన్ డాలర్ మార్కు అందుకున్న ఎన్టీఆర్ రెండో సినిమా ఇది. గతంలో ‘బాద్ షా' చిత్రం కూడా ఇక్కడ 1 మిలియన్ డాలర్ షేర్ సాధించింది. యూఎస్ డిస్ట్రిబ్యూటర్ సినీ గెలాక్సీ వారు ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. శనివారం(ఫిబ్రవరి 21) వరకు ఈ చిత్రం $1,004,222 షేర్ సాధించినట్లు ప్రకటించారు.


ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘Temper’ $1 Million mark at USA

మరో వైపు ‘టెంపర్' చిత్రం తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 35 కోట్ల షేర్ సాధించి టాప్ 3 పొజిషన్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి మరింత పికప్ ఇవ్వడానికి చిత్రంలో మరిన్ని సీన్స్ కలుపుతున్నట్లు సమాచారం. లెంగ్త్ ఎక్కువ అవుతుందని భావించి ఎడిటింగ్ లో తొలిగించిన కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కలువనున్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా ...అలి, సప్తగిరి మధ్య ఓ కామెడీని తీసి కట్ చేసేసారట. దాంతో సినిమాలో అది అర్దాంతరంగా ముగిసిన ఫీలింగ్, కామెడీ లేదనే కామెంట్స్ వచ్చాయి. దాంతో వీటిని కలిపి కొత్త వెర్షన్ ని వదులుతారని తెలుస్తోంది. చిత్రం రిలీజైన 30 వ రోజు సందర్భంగా వీటిని యాడ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. 35 కోట్ల షేర్ వద్ద చిత్రం డ్రాప్ అవటం ప్రారంభం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల భోగట్టా. దాంతో టెంపర్ కలెక్షన్స్ 50 కోట్లు చేరుతాయని భావిస్తున్నారు.


కాజల్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
As per the official numbers published by the film’s US distributors Cine Galaxy, ‘Temper’ collected $1,004,222 share until Saturday.
Please Wait while comments are loading...