The Conjuring Last Rites Collections: 2 రోజుల్లో 750 కోట్లు.. ఇండియాలో దుమ్ములేపుతున్న హాలీవుడ్ చిత్రం.. ఎన్ని

హాలీవుడ్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి శుక్రవారం హాలీవుడ్ నుంచి ఏదోక ఇంట్రెస్టింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఇక సెప్టెంబర్ 5న ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ అనే చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అమెరికన్ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రంగా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించారు. ఇయాన్ గోల్డ్‌బర్గ్, రిచర్డ్ నైంగ్, డేవిడ్ లెస్లీ జాన్సన్-మెక్‌గోల్డ్రిక్ కథను అందించారు.

ది కంజురింగ్ : లాస్ట్ నైట్స్ బడ్జెట్?
కంజురింగ్ ఫిల్మ్ సిరీస్‌లో ది కంజురింగ్ : లాస్ట్ నైట్స్ అనేది 9వ సిరీస్ కావడం విశేషం. స్మర్ల్ హాంటింగ్ నిజ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుందీ సిరీస్. ఇక ఈ చిత్రంలో పాట్రిక్ విల్సన్, వెరా ఫార్మిగా నటించారు. వారూ మియా టాంలిన్సన్, బెన్ హార్డీ, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లుగా ఎడ్, లోరైన్ వారెన్‌ లు అలరించారు. ఇలా టాప్ యాక్టర్స్, టాప్ టెక్నీషియన్లు పనిచేసిన ఈ చిత్రానికి 55 మిలియన్ల డాలర్ల బడ్జెట్ అయ్యింది. ఇండియన్ కరెన్సీలో ఈ చిత్రానికి రూ.485 కోట్ల ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

The Conjuring Last Rites Day 2 Box Office Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ పాయింట్..
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అటామిక్ మాన్స్టర్, ది సఫ్రాన్ కంపెనీ బ్యానర్లపై నిర్మాతలు జేమ్స్ వ్యాన్, పీటర్ సాఫ్రాన్ రూపించారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా న్యూ లైన్ సినిమా ద్వారా వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉందని చెబుతున్నారు.

ఓపెనింగ్ డే కలెక్షన్స్..
ది కంజురింగ్ : లాస్ట్ రైట్స్ చిత్రానికి యునైటెడ్ స్టేట్స్ తో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. 3700కు పైగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే వరల్డ్ వైడ్ గా 30 మిలియన్ల డాలర్స్ ను కలెక్ట్ చేసిందని ఓవర్సీస్ ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 120 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.

2 రోజుల్లో 750 కోట్లు వసూళ్లు?
ది కంజురింగ్ : లాస్ట్ రైట్స్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 2వ రోజు కూడా భారీగానే వసూళ్లు అందుకుంది. ది కంజురింగ్: లాస్ట్ రైట్స్ యునైటెడ్ స్టేట్స్, కెనడాలో 34.5 మిలియన్ డాలర్స్, ఇతర ప్రాంతాల్లో 47.3 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. వసూలు చేసింది, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81.8 మిలియన్ డాలర్లు వసూల్ చేసిందని, ఈ మొత్తం ఇండియన్ కరెన్సీలో 750 కోట్ల రూపాయలు ఉంటుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ఇండియాలో 2 రోజుల కలెక్షన్స్..
శుక్రవారం సెప్టెంబర్ 5న ఇండియన్ థియేటర్లలో ఐమాక్స్ ల్లో విడుదలైన ది కంజురింగ్ : లాస్ట్ రైట్స్ చిత్రం భారీగానే వసూళ్లను అందుకుంటోంది. 2 రోజుల్లోనే రూ.35 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.60 కోట్ల వరకు చేరుకుందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X