»   »  టాలీవుడ్ ఆల్ టైం టాప్-5: ఎన్టీఆర్ దెబ్బకు పొజిషన్స్ మారాయి!

టాలీవుడ్ ఆల్ టైం టాప్-5: ఎన్టీఆర్ దెబ్బకు పొజిషన్స్ మారాయి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ల లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరమే. తమ తమ హీరోల సినిమాలు అత్యధిక కలెక్షన్లతో టాప్ లిస్టులో ఉంటే అభిమానులకు హ్యాపీ ఫీలవుతారు. ఈ సంవత్సరం ఆరంభం నుండి చాలా సినిమాలు వచ్చాయి. అందులో ఒక్క సినిమా కూడా టాప్-5 లిస్టులో చోటు దక్కించుకోలేదు.

ఈ సంవత్సరం టాప్-5 లిస్టును కదిపే సినిమా ఇక ఏదీ రాదేమో అని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్న తరుణంలో....'జనతా గ్యారేజ్' వచ్చింది. పలు సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఏకంగా టాప్-3 పొజిషన్ కి వచ్చేసింది.

ట్రేడ్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం..... టాప్-5 సినిమాలకు సంబంధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

బాహుబలి

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ ఫిల్మ్ బాహుబలి గతేడాది విడుదలై తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలం అన్ని బాషల్లో రిలీజై భారీ విజయం సాధించింది. ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి రూ. 600 కోట్ల పైచిలుకు గ్రాస్ సాధించింది. తెలుగు వెర్షన్ విషయానికొస్తే ఈ చిత్రం రూ. 180 కోట్ల షేర్ సాధించింది. మళ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే సత్తా బాహుబలి-2కు మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 శ్రీమంతుడు

శ్రీమంతుడు

మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘శ్రీమంతుడు' మూవీ గతేడాది విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం 120 కోట్లకు పైగా గ్రాస్ సాధించగా.... రూ. 85 కోట్ల షేర్ వసూలు చేసింది.

 జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై తొలి మూడు వారాల్లో రూ. 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ. 76.5 కోట్ల షేర్ వచ్చింది. ఫుల్ రన్ లో ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.

 అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం 2013లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాహుబలి వచ్చే వరకు ఈ సినిమానే నెం.1 స్థానంలో కొనసాగింది. అప్పట్లో ఈచిత్రం దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్..... 74.75 కోట్ల షేర్ సాధించింది.

 మగధీర?, సరైనోడు?

మగధీర?, సరైనోడు?

2009లో విడుదలైన మగధీర షేర్ పరంగా ఇప్పటికీ టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషమే. అప్పట్లో ఈ చిత్రానికి దాదాపు రూ. 65 కోట్ల షేర్ వచ్చింది. అయితే ఆతర్వాత ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ విడుదల చేయగా మరో రూ. 8 కోట్ల షేర్ వచ్చిందని టాక్. మొత్తం దాదాపు రూ. 73 కోట్ల షేర్ వచ్చిందని అంటున్నారు. అయితే ఇటీవల విడుదలైన బన్నీ సరైనోడు మూవీకి కూడా 73 కోట్ల షేర్ సాధించిందని టాక్.

English summary
The first tollyood movie that comes to our mind when we hear about all time box office hits is Baahubali. Superstar Mahesh Babu starrer Srimanthudu which portrayed a social message with commercial elements comes next in the list. By end of its 18th day run, 'Janatha Garage' broke records of Pawan Kalyan's 'Attharintiki Daaredi' by good margin and thereby changed the top movies list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu