»   » నమ్మలేని నిజాలు :మహేష్, పవన్ వెనక్కి, ఎన్టీఆర్ బాగా ముందుకు, రజనీ టాప్

నమ్మలేని నిజాలు :మహేష్, పవన్ వెనక్కి, ఎన్టీఆర్ బాగా ముందుకు, రజనీ టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమా ప్రమోషన్ లో టీజర్స్ పాత్ర గురించి ఈ రోజున ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ని పరిచయం చేస్తూ, జనాలను ఆ సినిమా కోసం వెయిట్ చేయించగలిగేలా ఈ టీజర్స్ రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు కు అయితే ఈ టీజర్స్ కోసం అభిమానులు వెయిట్ చేసే పరిస్దితి.

ఈ టీజర్స్ తో సినిమాకు ఎంత సత్తా ఉందో అభిమానులు తెలుసుకున్నట్లే, టీజర్ సక్సెస్ ని బట్టి నిర్మాతలు సినిమా పై ఓ అంచనాకు వస్తారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తే..ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాసం ఉందని అంటారు. అఫ్ కోర్స్ ఆ అంచనాలు చాలాసార్లు తప్పుతున్నాయనుకోండి.


కాకపోతే టీజర్, ట్రైలర్ సక్సెస్ అయితే ఓపినింగ్స్ సూపర్ గా ఉంటాయనేది నిజం. ఈ టీజర్, ట్రైలర్స్ ని బట్టే బిజినెస్ కూడా చాలా సార్లు జరుగుతూంటుంది. ఎందుకంటే టీజర్ ని .ట్రైలర్ ని చూసే ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీసుకోవచ్చు అనే విషయం ఆధారపడి ఉంటుంది. దాంతో ఈ టీజర్స్ వ్యవహారం సీరియస్ బిజినెస్ అయ్యిపోయింది. దర్శక,నిర్మాతలు టీజర్ పైనే ఎక్కువ కాన్సర్టేట్ చేస్తున్నారు.


మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. దీంతో 2016 సంవత్సరంలో ట్రెండింగ్‌గా నిలిచిన అంశాలను అందరూ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌లో ఈ సంవత్సరం ట్రెండింగ్‌గా తెలుగు సినిమాలకు సంభందించిన టాప్ 10 సినిమాలేవో తెలుసుకుందాం. ఇవి కేవలం టాలీవుడ్ లో ట్రెండింగ్ టీజర్స్ మాత్రమే.


రజనీ మ్యాజిక్

రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి చిత్రం కేవలం టీజర్ తోనే భీబత్సమైన ఓపినింగ్స్ రాబట్టుకుంది. ఆ చిత్రం టీజర్ ఇప్పటికి 6,559,220 వ్యూస్ తెచ్చుకుని రికార్డ్ స్దాయిలో నెంబర్ వన్ గా నిలబడింది.


జనతాగ్యారేజ్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం పెద్ద హిట్టైంది. అలాగే ఈ చిత్రం టీజర్ సైతం రికార్డ్ లు క్రియేట్ చేసింది. 5,822,058 వ్యూస్ తెచ్చుకుని సెకండ్ ప్లేసులో నిలబడింది.


మూడవ ప్లేస్ ..

ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రం టీజర్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఈ టీజర్ అంచనాలు పెంచేసింది. ఈ టీజర్ కు ఇప్పటివరకూ 4,880,313 వ్యూస్ వచ్చాయి.


ధృవ చిత్రం

మొన్న డిసెంబర్ 9న విడుదలైన రామ్ చరణ్ తాజా చిత్రం ధృవ టీజర్ కు మంచి వ్యూస్ వచ్చాయి. కేవలం మెగాభిమానులు మాత్రమే కాకుండా అందరికీ ఈ టీజర్ నచ్చింది. అందరూ ఈ టీజర్ ని ప్రశంసల్లో ముంచెత్తారు. ఇప్పటివరకూ ఈ టీజర్ కు 4,461,667 కు వ్యూస్ వచ్చాయి.


ఐదవ ప్లేస్ లో

అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. అలాగే ఈ చిత్రం టీజర్ సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది. చిత్రం పై ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది. ఈ టీజర్ 2,648,907 వ్యూస్ తెచ్చుకుంది ఇప్పటివరకూ.


ఆరవ స్దానంలో

పవన్ కళ్యాణ్ హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఫ్లాఫ్ అయినా, టీజర్ మాత్రం రికార్డ్ స్దాయిలో క్లిక్ అయ్యింది. ఈ చిత్రానికి 2,601,115 వ్యూస్ వచ్చాయి.


ఏడవ స్దానం

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితేనేం ఈ చిత్రం టీజర్ మాత్రం బాగా సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం టీజర్ కు 1,670,156 వ్యూస్ వచ్చాయి.


ఎనిమిదవ స్దానం

పూరి జగన్నాథ్, కల్యాణ్ రామ్ కాంబినేషన్ లో రూపొందిన ఇజం చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా టీజర్ కు మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ టీజర్ కు ..1,658,049 వ్యూస్ వచ్చాయి.


తొమ్మిదవ స్దానం

త్రివిక్రమ్ , నితిన్ కాంబినేషన్ లో రూపొందిన అ..ఆ చిత్రం హిట్ అయ్యింది. అదే స్దాయిలో ఈ చిత్రం టీజర్ కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ కు ఇప్పటివరకూ... 1,275,695 వ్యూస్ వచ్చాయి.


పదవ స్దానం

నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందిన ఊపిరి చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం పివిపి బ్యానర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఈ చిత్రం టీజర్ కూడా అదే స్దాయిలో క్లిక్ అయ్యింది. ఈ టీజర్ కు ఇప్పటివరకూ .. 1,200,129 వ్యూస్ వచ్చాయి.


English summary
we have compiled the list of top 10 Tollywood movies of 2016 which received highest views for their teasers on YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu