»   »  బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా త్రిష

బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్ గా త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Trisha
ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మే బిగ్ సి గ్రూపు బ్రాండ్ అంబాసిడర్ గా ఇంతకాలం చార్మి వ్యవహరించిన సంగతి తెలిసిందే. చార్మి కాంట్రాక్ట్ కాలం ముగియడంతో ఆ కంపెనీ ఆమెను పక్కన బెట్టి త్రిషను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్టు తెలుస్తోంది.

బిగ్ సి రెండేళ్ళుగా మంచి బిజినెస్ చేసింది. ఈ ఏడాది హిట్ అయిన ఏకైక సినిమా "కృష్ణ"లో నటించిన త్రిష తాను తెలుగులో ఎవర్ గ్రీన్ అని చాటుకుంది. అందువల్లనే ఆమెకు ఇటువంటి అడ్వర్టయిజింగ్ అసైన్ మెంట్లు వస్తున్నాయి.త్రిష ఇప్పటికే టివిఎస్ స్కూటీ, ఫాంటా వంటి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X