twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Uday Kiran Birth Anniversary:లక్షల్లో రెమ్యునరేషన్, కోట్లల్లో ఇండస్ట్రీ రికార్డులు.మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్

    |

    ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కష్టంతో పాటు చాలా అదృష్టం కూడా ఉండాలి. అంతే కాకుండా జనాలు అతని ఎంతగానో ప్రేమిస్తే గాని అలాంటి సక్సెస్ కూడా అందదనే చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ కూడా ఒకప్పుడు అలాంటి మంచి మనసుతోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఎంట్రీ ఇచ్చిన 3 సినిమాలతోనే అతని బాక్సాఫీస్ రికార్డులను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఇక నేడు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని బాక్సాఫీస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

     మంచి లవర్ బాయ్..

    మంచి లవర్ బాయ్..

    మంచి లవర్ బాయ్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకున్న ఉదయ్ కిరణ్ కొన్ని సినిమాల తర్వాత వరుస అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక చివరికి 2014లో అతను తన ఫ్లాట్లోనే ఆత్మహత్య చేసుకొని కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాడు. ఉదయ్ మరణించి ఏళ్ళు గడుస్తున్నా కూడా అతన్ని ఎవరూ కూడా అంత ఈజీగా మర్చిపోవడం లేదు అనే చెప్పాలి.

    ఉదయ్ కిరణ్ పుట్టినరోజు

    ఉదయ్ కిరణ్ పుట్టినరోజు

    ఇక నేడు ఉదయ్ కిరణ్ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాడు. ఉదయ్ కిరణ్ అప్పట్లో అమ్మాయిలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మొదటి మూడు సినిమాలతోనే అతను క్రియేట్ చేసిన సంచలనాలు అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

     మొదటి సినిమా రెమ్యునరేషన్

    మొదటి సినిమా రెమ్యునరేషన్

    ఇక ఉదయ్ కిరణ్ నటించిన మొదటి సినిమా చిత్రంతోనే అతనికి మంచి గుర్తింపు లభించింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 12 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ సినిమాకు ఉదయ్ కిరణ్ కేవలం పదకొండు వేలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్నాడు. మొదటి సినిమా కాబట్టి దాదాపు ఆ సినిమాకు పనిచేసిన దర్శకుడికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్ కు హీరోయిన్ కు పదకొండు వేలు మాత్రమే ఇచ్చినట్లు దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

     నువ్వు నేను బాక్సాఫీస్ హిట్

    నువ్వు నేను బాక్సాఫీస్ హిట్

    'చిత్రం' సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఉదయ్ కిరణ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ తేజ దర్శకత్వంలోనే 'నువ్వు నేను' అనే సినిమా చేశాడు ఆ సినిమా కూడా ఉదయ్ కిరణ్ లక్షల్లోనే చాలా తక్కువ పారితోషికాన్ని అందుకున్నారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద 16 కోట్ల షేర్ అందుకుంది. ఆ సినిమాకు బడ్జెట్ కూడా కోటి కంటే ఎక్కువ కాలేదు.

    మనసంతా నువ్వే కలెక్షన్స్

    మనసంతా నువ్వే కలెక్షన్స్

    ఇక 2002లోనే నువ్వు నేను చేస్తున్నప్పుడే ఉదయ్ కిరణ్ కు 'మనసంతా నువ్వే' అనే సినిమాలో నటించే అవకాశం లభించింది. వరుస అపజయాలతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ఆ సినిమాకు కూడా ఉదయ్ కిరణ్ చాలా తక్కువ పారితోషికాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల షేర్ అందుకుంది.

    వరుస అపజయాలు

    వరుస అపజయాలు

    మొదటి మూడు సినిమాలతోనే ఉదయ్ కిరణ్ అగ్రహీరోల తరహాలో బాక్సాఫీస్ వద్ద రికార్డులను అందుకోవడంతో అతనికి ఆ తర్వాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఉదయ్ ఎప్పుడు కూడా స్టార్ ఇమేజ్ ను వాడుకొని కోట్లు సంపాదించాలని అనుకోలేదు. ఇక ఆ తరువాత అతని సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మార్కెట్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆ మనస్థాపంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని కొంతమంది సినీ ప్రముఖులు పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

    English summary
    Uday Kiran Birth Anniversary first three movie box office collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X