»   » పవన్, బాలయ్య, మహేష్, వెంకీ, బన్ని, అఖిల్ : అదే ముహూర్తం

పవన్, బాలయ్య, మహేష్, వెంకీ, బన్ని, అఖిల్ : అదే ముహూర్తం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఉగాది మిగతావాళ్లకు ఎలా ఉండనుందో కానీ తెలుగు సినిమా ప్రియులకు మాత్రం నిజమైన పండుగ చేసుకునేలా ముస్తాబు అవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ హంగామా మాత్రమే ఉగాదికు తెలుగు సినిమా పరిశ్రమ ఇస్తున్న కానుక అనుకునేరు. ఇంకా బోల్డన్ని ఉన్నాయి.

ఈ పండుగకు పెద్ద హీరోలు కేవలం విషెష్ చెప్పటమే కాక ప్రత్యేకమైన పండుగగా మిగిలిపోయేలా డిజైన్ చేస్తున్నారు. ఆ రోజు న తమ చిత్రాల ఫస్ట్ లుక్ లు, ట్రైలర్స్ విడుదల చేసి అభిమానులకు ఆనందం కలిగించనున్నారు.ఈ ఉగాది నాడు టాలివుడ్ హీరోలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతుండగా, అభిమానులు ఈ పండుగను ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.


అంతేకాదు ఆ రోజున చిత్రాలు ఓపినింగ్స్ కూడా జరగనున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, అఖిల్, ఈ ఉగాదికి ప్రత్యేకమైన ప్యాకేజ్ లాంటి వార్తలతో ముందుకు వస్తున్నారు. వారికి వెలకమ్ చెప్తూ..ఉగాది రోజు..టాలివుడ్ లో ముఖ్య విశేషాలు తెలుసుకుందాం.


వందో సినిమా

వందో సినిమా

ఈ ఉగాది రోజు నందమూరి బాలకృష్ణ వందో సినిమా ప్రకటన ఉండబోతోంది. ఈ ప్రకటన కోసం ఎప్పుడా అని యావత్‌ తెలుగు సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.అమరావతిలో ..

అమరావతిలో ..


‘ఉగాది రోజునే వందో సినిమా ప్రకటన చేయాలి' అని బాలకృష్ణ భావించడంతో... ఆ పండగే వందో సినిమా ముహూర్తంగా ఖారారైంది. పండగ రోజున అమరావతిలో బాలకృష్ణ స్వయంగా తన వందో సినిమా వివరాలను ప్రకటిస్తారు. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలూ ఆరోజున బయటకు వచ్చే వీలుంది.వెంకటేష్ ఫస్ట్ లుక్

వెంకటేష్ ఫస్ట్ లుక్


ఉగాది రోజునే వెంకటేష్‌ కొత్త సినిమా ‘బాబు బంగారం' ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల కాబోతోంది. వెంకటేష్‌, నయనతార జంటగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తారు.అల్లు అర్జున్..

అల్లు అర్జున్..


ఉగాదినే అల్లు అర్జున్‌, అఖిల్‌ తమ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. బన్నీ నటించిన ‘సరైనోడు' కొత్త ట్రైలర్‌ని ఆ రోజు విడుదల చేసే అవకాశం ఉంది.అదే రోజు అఖిల్ ప్రకటన

అదే రోజు అఖిల్ ప్రకటన


అఖిల్‌ రెండో చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఆ సినిమాకి సంబంధించిన ప్రకటన అఖిల్‌ తన పుట్టిన రోజున అభిమానులతో పంచుకోవచ్చు.ట్రైలర్

ట్రైలర్


మహేష్‌బాబు - శ్రీకాంత్‌ అడ్డాల చిత్రం ‘బ్రహ్మోత్సవం' ట్రైలర్ ని ఉగాది రోజున విడుదల చేస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీపక్కన పెడితే...

ఇవన్నీపక్కన పెడితే...


పవన్‌ కల్యాణ్‌ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం ఉగాదినే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.English summary
This Ugadai a true festival to Tollywood Fans. They will celebrate with sardar movie, ballyya's movie announcement and Mahesh's trailer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu