»   » హీరో ఉపేంద్ర భార్య.... ‘చిన్నారి’తో భయపెడుతుందా?

హీరో ఉపేంద్ర భార్య.... ‘చిన్నారి’తో భయపెడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం చిన్నారి. బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. ర‌వికుమార్‌, ఎం.ఎం.ఆర్ నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందిస్తున్నారు. లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ నాకు ద‌ర్శ‌కుడిగా తొలి చిత్ర‌మిది. హార‌ర్ జోన‌ర్‌లో చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేశాం. త‌ల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్త‌యింది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉంద‌ని చాలా మంది చెబుతున్నారు. వేణు కెమెరా ప‌నిత‌నం, ర‌విచంద్‌కుమార్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారు అని చెప్పారు.

Upendra's wife Priyanka's 'Chinnari' to releasing on Nov 25

నిర్మాత‌లు మాట్లాడుతూ హార‌ర్ చిత్ర‌మిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. గోవా నేప‌థ్యంలో క‌థ జ‌రుగుతుంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. రంగి త‌రంగికి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చ‌క్క‌టి బాణీల‌ను ఇచ్చారు. క‌న్న‌డ‌లో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్ర‌ఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. ఈ నెల 25న సినిమాను విడుద‌ల చేస్తాం అని తెలిపారు.

English summary
Priyanka, the wife of Kannada star hero Upendra, is playing the key role in the film titled ‘Chinnari’. Baby Yulinee, Aishwarya and Madhusudan have played other important roles in the film. K Ravikumar and MMR are jointly producing this Telugu and Kannada bilingual film under KRK Productions and Lakshmi Venkateswara Movies banners. Lohith is the director. 'Chinnari' to releasing on Nov 25.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu