twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Uppena 11th day collections: ఆగని ఉప్పెన కలెక్షన్ల సునామీ.. స్టార్ హీరోల మూవీస్‌ను మించి...

    |

    సంచలన విజయం వైపు దూసుకెళ్తున్న ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం 10 రోజుల తర్వాత టాలీవుడ్‌లో మిగితా చిత్రాల కంటే ఎక్కువగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 11వ రోజున ఎంత వసూలు చేసిందంటే...

    11వ రోజున ఉప్పెన కలెక్షన్లు

    11వ రోజున ఉప్పెన కలెక్షన్లు

    గత వారం రిలీజైన కొత్త సినిమాల నుంచి పోటీని తట్టుకొని ఉప్పెన చిత్రం మోస్తారు వసూళ్లు రాబట్టింది. నైజాంలో రూ.42 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.22 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.13 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.4.6 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.5.7 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.5.6 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.4 లక్షల వసూళ్లు సాధించింది.

    మొత్తం 11 రోజుల వసూళ్లు

    మొత్తం 11 రోజుల వసూళ్లు

    ఉప్పెన గత 11 రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. నైజాంలో రూ.13.59 కోట్లు, సీడెడ్‌లో రూ.6.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.7.51 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.4.35 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ.2.37 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.2.65 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.80 కోట్లు, నెల్లూరు జిల్లాలో రూ.1.55 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.

    ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే

    ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే

    ఇక 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లతో ఏపీ, తెలంగాణలో మొత్తం కలిపి రూ.41.51 కోట్ల నికర వసూళ్లు, రూ.66.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకొంటే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో చూసుకొంటే.. రూ.2.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.28 కోట్లు నమోదు చేసింది. మొత్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఈ చిత్రం 44.96 కోట్ల నికర, 72.10 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    ఇప్పటికే 24 కోట్ల లాభంతో

    ఇప్పటికే 24 కోట్ల లాభంతో

    ఇదిలా ఉండగా, ఉప్పెన చిత్రం రూ.20.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.45 కోట్ల మేర వసూళ్లను సాధించింది. అంటే దాదాపు 24 కోట్ల రూపాయల లాభాన్ని నమోదు చేసింది. లాక్‌డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా పలు రికార్డులను క్రియేట్ చేసింది.

    11 రోజుల్లో ఏరియాల వారీగా ప్రాఫిట్స్

    11 రోజుల్లో ఏరియాల వారీగా ప్రాఫిట్స్

    ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలకు వస్తే.. నైజాం హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడుపోగా.. సుమారు రూ.13.59 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో రూ.3 కోట్లు బిజినెస్ జరుగగా రూ.6.69 కోట్లు వసూలు చేసింది. ఆంధ్రాలో రూ.10 కోట్లు బిజినెస్ చేస్తే.. 28 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Uppena 11th day collections: Vaishnav Tej movie facing tough competition from latest releases. Uppena movie is roaring at box office. This movie surpassing the records national wide. Debut hero Vaishnav Tej crossed Hrithik Roshan's Kaho na Pyar hai records. Its crosses 72 crores collection worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X