Just In
- 24 min ago
అభిమానిని కొట్టిన బాలయ్య: అందుకే నాపై కోపం.. ప్రచారంలో నన్ను మాత్రమేనంటూ బాధితుడి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
పవన్ గారిలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.. అమ్మాయిలకు అవకాశం ఇస్తారా: వాళ్లకు అషు రెడ్డి వార్నింగ్
- 2 hrs ago
తండ్రైన సుడిగాలి సుధీర్.. ఏకంగా బిడ్డతోనే: వాళ్లను అలా అడగడం వల్లే అంటూ రష్మీ సంచలన వ్యాఖ్యలు
- 12 hrs ago
ట్రెండింగ్ : ఆనందంలో తప్పు చేసేసింది!.. 18 నెలల కాపురం.. సంచలనం రేపుతున్న కిమ్
Don't Miss!
- Finance
4G ఎల్టీఈ కనెక్టివిటీ, జియో ఆండ్రాయిడ్ ఓఎస్‌తో జియోబుక్ ల్యాప్‌టాప్
- News
ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Sports
India vs England: బెయిల్ దాచేసిన రిషబ్ పంత్.. వెతికిన అంపైర్, ఆటగాళ్లు! చివరకు!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Uppena 10 day Collections: ఆ నాలుగు సినిమాలకు షాకిచ్చిన ‘ఉప్పెన’.. టాలీవుడ్‌లోనే ఫస్ట్ మూవీగా రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అంతటి పెద్ద కుటుంబం నుంచి హీరో పరిచయం అవుతున్నాడంటే.. ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఓ కమర్షియల్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంటారు. కానీ, ఊహించని విధంగా ఓ ప్రయోగాత్మక ప్రేమకథతో పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక, పదో రోజు మళ్లీ పుంజుకుని రికార్డు సాధించింది. ఆ వివరాలు మీకోసం!

సత్తా చాటిన కొత్త టీమ్... సక్సెస్ కొట్టింది
పంజా వైష్ణవ్ తేజ్.. కృతి శెట్టి హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఉప్పెన'. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగులో తొలిసారి పూర్తి స్థాయి పాత్రను చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. విడుదలకు ముందే అంచనాలు పెంచుకున్న ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

స్పందనతో సంబంధం లేకుండా కలెక్షన్లు
ఎన్నో అంచనాల నడుమ ‘ఉప్పెన' మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోవడంతో ఈ మూవీ ఫలితంపై అందరిలోనూ ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. అయినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిందీ సినిమా. తద్వారా కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

మూడో రోజే ఫినీష్.. ఆ రికార్డులన్నీ బ్రేక్
షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. లాక్‌డౌన్ కారణంగా ‘ఉప్పెన' రిలీజ్ కాలేదు. ఈ గ్యాప్‌లో ‘నీ కన్ను నీలి సముద్రం' అనే పాట దీనిపై అంచనాలు పెంచేసింది. అలాగే, టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ చిత్రానికి రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 21 కోట్లైంది. ఈ టార్గెట్‌ను కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

పదో రోజు ఎక్కడ? ఎంత వసూలు చేసింది?
నాలుగు సినిమాలున్నా.. ఉప్పెన పదో రోజూ భారీగా పుంజుకుంది. దీంతో నైజాంలో రూ. 91 లక్షలు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్‌లో రూ. 26 లక్షలు, వెస్ట్‌లో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 17 లక్షలు, కృష్ణాలో రూ. 18.1 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలు రాబట్టింది. మొత్తంగా నాలుగో రోజు రూ. 2.61 కోట్లు షేర్, రూ. 4.55 కోట్ల గ్రాస్ వచ్చింది.

పదో రోజు అంతలా.. మొత్తంగా ఎంతంటే?
‘ఉప్పెన' మొదటి రోజు రూ. 9.35 కోట్లు, రెండో రోజు రూ. 6.86 కోట్లు, మూడో రోజు రూ. 8.26 కోట్లు, నాలుగో రోజు రూ. 4.17 కోట్లు, ఐదో రోజు రూ. 3.12 కోట్లు, ఆరో రోజు రూ. 1.93 కోట్లు, ఏడో రోజు రూ. 1.44 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 1.13 కోట్లు, తొమ్మిదో రోజు రూ. 1.49 కోట్లు, పదో రోజు రూ. 2.61 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ. 40.36 కోట్ల షేర్, రూ. 64.80 కోట్ల గ్రాస్ అందుకుంది.

టాలీవుడ్‌లోనే మొదటి సినిమాగా రికార్డు
‘ఉప్పెన' విడుదలైన రోజు నుంచే మీడియం రేంజ్ సినిమాల రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే పదో రోజు ఏకంగా రూ. 2.61 కోట్లు వసూలు చేసి.. ఈ చిత్రాల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. దీని కంటే ముందు వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా' పదో రోజు రూ. 1.89 కోట్లు రాబట్టింది. ఇప్పుడిది రెండో స్థానానికి పడిపోవడం గమనార్హం.