Don't Miss!
- News
పోస్టింగ్ కోసం సోమేష్ కుమార్ ఎదురు చూస్తోన్న వేళ- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Varisu Hindi first week Collections ఉత్తరాదిలో విజయ్ కలెక్షన్ల హవా.. తొలివారం హిందీ కలెక్షన్లు ఎంతంటే?
ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ అందుకొంటున్నది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ బరిలో విజేతగా నిలిచింది. తమిళంలో రికార్డు వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది.
వారిసు చిత్రం హిందీ వెర్షన్ జనవరి 11న తమిళంలో రిలీజ్ అయితే.. హిందీలో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో తొలి రోజు 81 లక్షలు, రెండో రోజు 1.61 కోట్లు, మూడో రోజు 1.68 కోట్లు, నాలుగో రోజు 64 లక్షలు, ఐదో రోజు 55 లక్షలు, ఆరో రోజు 49 లక్షలు, ఏడో రోజు 44 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత ఏడు రోజుల్లో 6.22 కోట్లు రాబట్టింది.

గతంలో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి వారం ముగిసే సమయానికి 4.73 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం వారిసు చిత్రం తొలివారం ముగిసే సమయానికి 6.22 కోట్లు వసూలు చేసింది.
వారిసు ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 131 కోట్ల షేర్, 153 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 74 కోట్లు రాబట్టడం విశేషంగా మారింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 228 కోట్ల రాబట్టింది. ఇంకా నిలకడగా వసూళ్లను సాధిస్తూ దిగ్విజయంగా దూసుకెళ్తున్నారు.