Don't Miss!
- News
మెగా కోడలు ఉపాసన పుట్టింట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రామ్ చరణ్ భార్య!!
- Sports
INDvsNZ : మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా.. పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ రహస్యాలను ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Finance
Sahara: భయంలో జీవిస్తున్న మహిళ.. సుబ్రతా రాయ్‌తో సహా 22 మందిపై కేసు..
- Technology
Apple నుంచి తర్వాత రాబోయే, iPhone 15 ప్రో ఫీచర్లు లీక్ అయ్యాయి! వివరాలు
- Automobiles
రూ. 25,000 చెల్లించి సిట్రోయెన్ eC3 బుక్ చేసుకోండి - పూర్తి వివరాలు
అఖండ రికార్డును బ్రేక్ చేసిన వీర సింహా రెడ్డి.. బాలయ్య బాబు కెరీర్ లో న్యూ రికార్డ్!
నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఆయన రేంజ్ ఇటీవల కాలంలో అయితే మామూలుగా పెరగలేదు అని చెప్పవచ్చు. అన్ స్టాపబుల్ ద్వారా జనాలకు మరింత దగ్గరైన బాలకృష్ణ ఇప్పుడు అఖండ సినిమా తర్వాత వీర సింహారెడ్డి సినిమాతో మరోసారి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అతని కెరీర్ లోనే వీరసింహారెడ్డి మర్చిపోలేని విధంగా ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమా మొత్తానికి అఖండకు సంబంధించిన ఒక రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ వద్ద జై బాలయ్య బ్రాండ్
నందమూరి బాలకృష్ణ రేంజ్ రోజురోజుకీ మరింత పెరిగిపోతుంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో ఆయన మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ షో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా క్రేజ్ అందుకోగా బాలయ్య బాబు తన అభిమానుల సంఖ్యను కూడా పెంచుకుంటున్నాడు. జై బాలయ్య అనే బ్రాండ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఉపయోగపడుతోంది.

అఖండ టోటల్ కలెక్షన్స్
నందమూరి బాలకృష్ణ కెరీర్లో అఖండ సినిమా మొన్నటి వరకు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 75.50 కోట్ల షేర్ తో పాటు 133 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అప్పటివరకు బాలయ్య బాబు ఆ రేంజ్ లో ఏ సినిమాతో కలెక్షన్స్ అందుకోలేదు.

వీరసింహారెడ్డి రెడ్డికి భారీ ఒపెనింగ్స్
ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన మాస్ కమర్షియల్ మూవీ వీరసింహారెడ్డి సినిమా కూడా అదే తరహాలో మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు మొదట్లో కొంత నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ కూడా ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చాయి. కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. బాలయ్య బాబు తన స్టార్ ఇమేజ్ తోనే కలెక్షన్స్ నెంబర్స్ ను పెంచుకుంటూ వెళ్ళాడు.

అఖండ రికార్డు బ్రేక్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా 73 కోట్ల ఆ రేంజ్ లో బిజినెస్ చేసింది ఇక ఈ సినిమా మొదటివారం ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద టోటల్ గా 53.49 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది. అంటే బాలకృష్ణ అఖండ సినిమా మొదట వారం 52 కోట్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. మొదటి వారంలో ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్లు అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది.

సక్సెస్ కావాలి అంటే..
ఇక వీర సింహారెడ్డి బుధవారం బాగానే కలెక్షన్స్ అందుకుంది. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ ను అయితే ఈ సినిమా పూర్తి చేయలేదు. ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద అయితే 73 కోట్ల బిజినెస్ చేసింది. అంటే 74 కోట్ల టార్గెట్ అందుకుంటేనే ప్రాఫిట్ లోకి వచ్చినట్లు లెక్క. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ లెక్కల ప్రకారం మరో 5 కోట్లు దాటితేనే ప్రాఫిట్ లిస్టులోకి వస్తుంది. మరి ఆ నెంబర్స్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి.