»   » వెంకటేష్ ఏజ్ ఏమైంది బాసూ....ఈ వీడియో చూస్తే అదే డౌట్

వెంకటేష్ ఏజ్ ఏమైంది బాసూ....ఈ వీడియో చూస్తే అదే డౌట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'విక్టరీ'ని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్‌ వయస్సు పెరుగుతున్న కొద్ది వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. ఎక్కడా వయస్సు వస్తున్న ఛాయలు ఆయనలో కనపడటం లేదు. అందుకు తాజా ఉదాహరణ ..గురు టీజర్.

మంగళవారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ 'గురు' టీజర్ ని విడుదల చేసారు. ఇంతకు ముందే ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న వెంకటేష్ ఇప్పుడు టీజర్ తో దుమ్ము దులిపారు. వెంకటేశ్‌ ఈ రోజుపుట్టినరోజు జరుపుకొంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రాన్ని వచ్చే ఏడాది జవనరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన 'సాలా ఖడూస్‌'కి రీమేక్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. వైనాట్‌ స్టూడియోస్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. రితికా సింగ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇక తన తదుపరి చిత్రంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లూ మీకు జోహార్లు అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉంది. త్వరలో క్రిష్ తోను ఓ మూవీ చేసేందుకు ఈ సీనియర్ హీరో రెడీ అయ్యాడట.

మరి వెంకీ తాజా చిత్రం గురు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుండగా, ఈ చిత్రం వెంకీ కి బిగ్గెస్ట్ హిట్ అందించాలని కోరుకుందాం. వెంకటేష్ తన 56వ బర్త్ డేని కుటుంబ సభ్యులతో కలిసి గోవా జరుపుకుంటున్నట్టు సమాచారం. ప్రేక్షకులను మెప్పించే మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటూ వెంకీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Guru is the upcoming movie of Victory Venkatesh which is going to be released on the event of Republic Day i.e. January 26th. Now its' teaser released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu