Just In
- 12 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 31 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- News
కాస్మిక్ గర్ల్: పీఎస్ఎల్వీలు కాదు.. విమానం ద్వారా ఉపగ్రహాల ప్రయోగం: ఒకేసారి తొమ్మిది
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వెంకీ మామ 14 రోజుల కలెక్షన్లు: హిట్టా? ఫట్టా? విక్టరీ ఖాతాలో..
విక్టరీ వెంకటేష్ ఖాతాలో 2019లో మరో భారీ హిట్టు చేరిపోయింది. మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండు వారాల్లోనే లాభాల్లోకి చేరిపోయి సెన్సేషనల్ హిట్టుగా మారింది. గత 14 రోజుల్లో వెంకీమామ ఎంత వసూలు చేసిందంటే..

14వ రోజు కలెక్షన్లు
ఏపీ, తెలంగాణలో వెంకీ మామ 14వ రోజున కూడా మంచి లాభాలను సాధించింది. ఈ చిత్రం నైజాంలో రూ.24 లక్షలు, సీడెడ్‌లో రూ.6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.16 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ.3 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్ష వసూలు చేసింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.58 లక్షలు వసూలు చేసింది.

14 రోజుల్లో వెంకీమామ హవా
తెలుగు రాష్ట్రాల్లో గత 14 రోజుల కలెక్షన్లను చూసుకొంటే.. నైజాంలో రూ.11.16 కోట్లు, సీడెడ్‌లో రూ.4.48 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.4.61 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.17 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.34 కోట్లు, గుంటూరులో రూ.2.14 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.68 కోట్లు, నెల్లూరులో రూ.94 లక్షలు వసూలు చేసింది. దాంతో తెలంగాణ, ఏపీలో 28.52 కోట్లు షేర్ సాధించింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో
ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వెంకీ మామ సత్తా చాటింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.2.60 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో రూ.3.17 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.34.29 కోట్లు షేర్, రూ.58.90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ప్రపంచవ్యాప్తంగా వెంకీ మామ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంది.. నైజాంలో రూ.7.50 కోట్లు, సీడెడ్‌లో రూ.5.40 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.3.60 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.2.40 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 కోట్లు, గుంటూరులో రూ.3 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.40 కోట్లు, నెల్లూరులో రూ.1.30 కోట్లు మేర బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, మిగితా రాష్ట్రాల రూ.2.70 కోట్లు, ఓవర్సీస్ రూ.2.80 కోట్లు నమోదు చేసింది.

విక్టరీ ఖాతాలో రెండో హిట్
వెంకీ మామ ప్రపంచవ్యాప్తంగా రూ.33.10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. రూ.34 కోట్లు షేర్ సాధిస్తే లాభాల్లోకి రావాల్సి ఉండగా, 14 రోజుల్లో రూ.34.29 కోట్లు రాబట్టడంతో హిట్‌గా నిలిచింది. దాంతో వెంకటేష్ ఖాతాలో ఈ ఏడాది F2తోపాటు వెంకీమామ హిట్‌గా నిలిచింది.