»   »  సూపర్ హిట్ 'బిచ్చగాడు' గురించి మరో ఆశ్చర్యకమైన వార్త

సూపర్ హిట్ 'బిచ్చగాడు' గురించి మరో ఆశ్చర్యకమైన వార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ డబ్బింగ్ చిన్న సినిమాగా వచ్చిన 'బిచ్చగాడు' సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం ఇంకా తెలుగు పరిశ్రమలో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రంకు ముందు వచ్చిన పెద్ద సినిమాలు, ఆ తర్వాత విడుదలైన అగ్ర చిత్రాలు ధియేటర్లను వీడిపోయాయి గానీ, 'బిచ్చగాడు' మాత్రం కోట్లకు కోట్లు వసూలు చేస్తూ నిర్మాతకు అసలైన పండగను రుచి చూపించి అందరికీ షాక్ ఇచ్చింది.

తెలుగునాట చిన్న సినిమాగా విడుదలైన ఈ డబ్బింగ్ సినిమా భారీ కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒక డబ్బింగ్ సినిమా స్టార్ హీరో ల రేంజ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టడం సామాన్యమైన విషయం కాదని సినీ పండితులు నోరెళ్ళ బెడుతున్న నేపధ్యంలో ఈ చిత్రం రీమేక్ వార్తలను మరింతా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడీ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇంతకీ ఈ సినిమాని హిందీలో ఏ హీరో చేయబోతున్నారు, ఎవరు డైరక్ట్ చేస్తారు..నిర్మాత ఎవరు అనే సందేహాలు మీకు కలుగుతున్నాయి కదా, ఆ వివరాలు క్రింద స్లైడ్ షోలో చదవండి. హిందీలో కూడా సంచలనం సృష్టించే అవకాసం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

స్లైడ్ షోలో మిగతా డిటేల్స్...

అంత పెద్ద సంస్ద

అంత పెద్ద సంస్ద

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ బాలీవుడ్‌లో 'బిచ్చగాడు' రీమేక్‌ని నిర్మించనుందని సమాచారం.

డైరక్టర్ గా ..

డైరక్టర్ గా ..

ఈ చిత్రం హిందీ వెర్షన్ కు సైతం బిచ్చగాడు డైరక్టర్ శశి దర్శకత్వం వహిస్తేనే మంచిదని నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు.

హీరోగా..

హీరోగా..


'బిచ్చగాడు' పాత్రలో మరోసారి విజయ్ ఆంటోని నటించనున్నారని సమాచారం. అది కేవలం ఆప్షన్ మాత్రమే అని, బాలీవుడ్ లో మరో పేరున్న హీరో డేట్స్ దొరికితే విజయ్ సీన్ లోకి రాకపోవచ్చు.

ప్రారంభం

ప్రారంభం

వచ్చే ఏడాది ప్రారంభంలో హిందీ రీమేక్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

పూర్తయ్యాక...

పూర్తయ్యాక...

విజయ్ ఆంటోని, శశి చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత హిందీలో 'బిచ్చగాడు' రీమేక్ చేయాలనుకుంటున్నారట.

అక్కడ కూడా పాగా

అక్కడ కూడా పాగా


బిచ్చగాడుతో తెలుగులో పాగా వేసినట్లే హిందీలోనూ ఇదే సినిమాతో ఎంట్రీ ఇవ్వటం మంచిదని విజయ్ ఆంటోని భావించారట

ఇక్కడ సక్సెస్

ఇక్కడ సక్సెస్

'బ్రహ్మోత్సవం' సినిమాను పక్కనపెట్టి, ఎగ్జిబిటర్లు 'బిచ్చగాడు' సినిమా ప్రింట్లను తెప్పించుకుని ప్రదర్శించమే ఈ సినిమా తొలి సక్సెస్

అప్పటివరకు...

అప్పటివరకు...

బాక్సాఫీస్ ని ఏలిన 'సరైనోడు' సినిమాను, అలాగే ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటిన 'అ.ఆ.' సినిమా ప్రభంజనాన్ని కూడా తట్టుకుని, ఇప్పటికీ దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీతో విజయవంతంగా ప్రదర్శింపబడింది

ఇవే ప్లస్ లు

ఇవే ప్లస్ లు


విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి.

ముఖ్యంగా...

ముఖ్యంగా...

సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది

మరొకటి

మరొకటి


తాజాగా మరో డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ ఆంటోని. కథల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా ఉండే విజయ్ ఆంటోని ప్రస్తుతం భేతాళుడు( సైతాన్) టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.

తిరుగులేనట్లే

తిరుగులేనట్లే


పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తే తెలుగులో విజయ్ ఆంటోనికి ఇక తిరుగుండదంటున్నారు విశ్లేషకులు.

English summary
As per the latest sources, A famous producer bagged the Hindi remake rights of Vijay Antony’s super hit film ‘Bichagadu’. Tamil young actor Vijay Antony’s super hit film ‘Bichagadu’ is a dubbed version of Kollywood film titled as ‘Pichaikkaran’, which is helmed by Sasi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu