twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast 3 Days Collections: విజయ్ మూవీకి ఊహించని కలెక్షన్లు.. తెలుగులో RRRతో సమానంగా!

    |

    పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తున్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

    ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్.. తాజాగా 'బీస్ట్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. మరి మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

     వీర రాఘవన్‌గా వచ్చేసిన విజయ్

    వీర రాఘవన్‌గా వచ్చేసిన విజయ్

    'డాక్టర్' మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్న నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రమే 'బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు.

    Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్Samantha స్పోర్ట్స్ బ్రాతో సమంత అరాచకం.. అమాంతం పైకి లేపేసి షాకిచ్చిన హీరోయిన్

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

    తమిళంలోనే కాకుండా విజయ్‌కు దక్షిణాది మొత్తంలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు 'బీస్ట్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ బిజినెస్ చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 కోట్ల వ్యాపారం జరుపుకుంది.

    3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    విజయ్ 'బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి.. మూడో రోజు రూ. 78 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Bigg Boss Non Stop: ఈ వారం ఊహించని ఓటింగ్‌.. స్ట్రాంగ్ ప్లేయర్‌కు షాక్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే!Bigg Boss Non Stop: ఈ వారం ఊహించని ఓటింగ్‌.. స్ట్రాంగ్ ప్లేయర్‌కు షాక్.. ఈ సారి ఎలిమినేట్ ఎవరంటే!

    3 రోజులకూ కలిపి వచ్చిందెంత

    3 రోజులకూ కలిపి వచ్చిందెంత

    తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనూ బీస్ట్ మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.02 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్‌లో రూ. 47 లక్షలు, వెస్ట్‌లో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి.. మొత్తంగా రూ. 6.69 కోట్లు షేర్, రూ. 11.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

    క్రేజీ కాంబినేషన్‌లో 'బీస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 6.69 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.81 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్నీ సైజ్ ఎంత అంటూ శృతి హాసన్‌కు ప్రశ్న: నువ్వే కొలుచుకో అంటూ చూపించిన హీరోయిన్

    విజయ్ కెరీర్‌లో రెండో స్థానం

    విజయ్ కెరీర్‌లో రెండో స్థానం

    ఇళయదళపతి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతడి చిత్రాలు ఇక్కడ కూడా వస్తుంటాయి. ఇక, ఈ స్టార్ హీరో నటించిన 'బీస్ట్'కు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు నుంచి మంచి స్పందనే దక్కుతుందని చెప్పాలి. ఇక, శుక్రవారం అయితే ఈ సినిమా రూ. 78 లక్షలు వసూలు చేసింది. ఇదే రోజు RRR మూవీ రూ. 84 లక్షలే వసూలు చేయడం గమనార్హం.

    Recommended Video

    KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
     మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

    మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

    'బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 6.69 కోట్లు వచ్చాయి. ఇక, ఈ సినిమాకు తమిళనాడులో రూ. 37.50 కోట్లు, కర్నాటకలో రూ. 5.50 కోట్లు, కేరళలో రూ. 4.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 18 కోట్లు వసూలు అయ్యాయి. ఫైనల్‌గా మూడు రోజుల్లో విజయ్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.19 కోట్లు షేర్, రూ. 144 కోట్లు గ్రాస్ వచ్చింది.

    English summary
    Kollywood Star Hero Vijay Did Beast Movie Under Nelson Dilipkumar Direction. This Movie Collects Rs 6.69 Cr in 3 days in Telugu Stats.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X