twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger సినిమాకు షాకింగ్ రెమ్యునరేషన్స్.. విజయ్ తో పాటు అతనికి కూడా సాలీడ్ పేమెంట్!

    |

    విజయ్ దేవరకొండ నటించిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లైగర్ గురువారం రోజు గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విభిన్నమైన టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక రెండవ రోజు నుంచి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు పరితోషికాలు ఎంత ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తో పాటు ఇందులో ప్రత్యేకమైన పాత్రలో కనిపించిన మైక్ టైసన్ ఎంత తీసుకున్నాడు అనేది కూడా వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    బిగ్ రిలీజ్

    బిగ్ రిలీజ్

    డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదలైంది. పాన్ ఇండియా సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ సినిమా భారీగా విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సినిమాను థియేటర్లో చూసేందుకు హిందీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

    స్ట్రాంగ్ ఓపెనింగ్ కలెక్షన్స్

    స్ట్రాంగ్ ఓపెనింగ్ కలెక్షన్స్

    ఇక మొత్తానికి లైగర్ మొదటి రోజు మంచి వసూళ్లను సొంతం చేసుకుని నిర్మాతలకు మంచి నమ్మకం అయితే ఏర్పరచింది. కానీ కొంత డివైడ్ టాక్ కూడా వస్తూ ఉండడంతో సినిమా రిజల్ట్ ఏమిటి అనేది ఇప్పుడే ఫైనల్ కాలేదు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కలెక్షన్స్ బట్టి ఈ సినిమా రిజల్ట్ కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీకెండ్ పూర్తయ్యే వరకు కూడా సినిమా అసలు సంగతి ఏమిటి అనేది తెలియదని అంటున్నారు.

     భారీగా రెమ్యునరేషన్స్

    భారీగా రెమ్యునరేషన్స్

    ఇక లైగర్ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు చార్మి కూడా సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు మరొక నిర్మాతగా పెట్టుబడి పెట్టడం జరిగింది. హిందీలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి కారణం కూడా ఆయనే. ఇక ఈ సినిమాకు పని చేసిన వారికి కూడా భారీ స్థాయిలోనే పారితోషికాలు ఇచ్చినట్లు సమాచారం.

     రమ్యకృష్ణ రెమ్యునరేషన్

    రమ్యకృష్ణ రెమ్యునరేషన్

    సినిమాలో విజయ్ కు తల్లి పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ దాదాపు కోటి రూపాయలు వరకు పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమె సినిమాలో నాగమణిగా కనిపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కూడా దాదాపు రెండు కోట్లకు పైగానే అందుకున్నట్లు సమాచారం. ఇక మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించిన విష్ణు రెడ్డి 80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇక మకరంద్ దేష్ పాండే 40 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    విజయ్ కు ఎంతించారంటే?

    విజయ్ కు ఎంతించారంటే?

    ఇక అందరి ఫోకస్ అయితే విజయ్ దేవరకొండ పైనే ఉంది. ఒక విధంగా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక భారీ బడ్జెట్లో కూడా నిర్మించబడింది. ఇక సినిమాకు కూడా విజయ్ మొదటిసారి అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నాడు. దాదాపు 20 కోట్ల నుంచి 25 కోట్ల మద్యలోనే తీసుకున్నట్లు టాక్ వస్తోంది.

    మైక్ టైసన్ రెమ్యునరేషన్

    మైక్ టైసన్ రెమ్యునరేషన్

    ఇక సినిమాలో విభిన్నమైమ పాత్రలో నటించిన మైక్ టైసన్ కూడా దాదాపు హీరోల రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. లైగర్ సినిమాలో మైక్ టైసన్, విజయ్ కలయికలో వచ్చిన సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక మైక్ టైసన్ కోసం దాదాపు ఏడాది పాటు ఎదురు చూసిన చిత్ర యూనిట్ అతను అడిగినంత ఇచ్చి సినిమాలో బాగమయ్యేలా చేశారు. ఆ లెక్క 10 కోట్లకు పైగానే ఉంటుందట. ఇక విజయ్ కంటే ఎక్కువ తీసుకున్నాడాని కూడా మరొక టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో చిత్ర యూనిట్ సభ్యులే క్లారిటీ ఇవ్వాలి.

    English summary
    vijay devarakonda liger movie total cast remuneration details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X