Just In
- 4 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
- 4 hrs ago
తెలుగులో భారీగా ఆఫర్లు అందుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. అఖిల్, బన్నీతో కూడా..
- 5 hrs ago
నగ్నంగా సీనియర్ నటి ఫోటోషూట్.. సంచలనం రేపుతున్న కిమ్
- 6 hrs ago
మహానటి దర్శకుడి కోసం మరో కొత్త ప్లాన్ రెడీ చేసుకున్న ప్రభాస్!
Don't Miss!
- News
లాయర్ దంపతుల హత్య: సుందిళ్ల బ్యారేజీలో కత్తులు లభ్యం, భారీ అయస్కాంతాలతో..
- Finance
ఆ ధరతో రూ.10,500 తక్కువ, రూ.46,000 దిగువకు పడిపోయిన బంగారం
- Sports
హార్దిక్ పాండ్యాతో పోటీకి శార్దూల్ ఠాకూర్ సై.. 6 సిక్స్‌లతో వీరవిహారం.. సెంచరీ జస్ట్ మిస్!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Lifestyle
బియ్యం పిండిని ఇలా ఉపయోగించడం వల్ల కలిగే అద్భుతాల గురించి మీకు తెలుసా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Box office: ప్లాప్ టాక్ వచ్చిన తగ్గని మాస్టర్ జోరు.. అప్పుడే సెంచరీ బాదేశాడు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ వసూళ్లను అందుకోవడం కామన్. అభిమానులకు నచ్చే విధంగా నాలుగు సన్నివేశాలు ఉంటే చాలు కలెక్షన్స్ డోస్ మామూలుగా ఉండదు. ఇటీవల మాస్టర్ సినిమా ఓపెనింగ్స్ తోనే విజయ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి క్లారిటిగా అర్ధమయ్యింది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టినట్లు తెలుస్తోంది.
థియేటర్స్ లో మాస్టర్ హంగామా (ఫొటోలు)

మధ్యలో ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా..
ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. గత ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక సినిమాకు మధ్యలో ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు.

మొదట్లో ఆందోళన కలిగించిన పరిస్థితులు
ఇక సినిమా ఈ కరోనా కష్ట కాలంలో వసూళ్లను ఎంతవరకు అందుకుంటుంది అనేది మొదట్లో అందరిని ఆందోళనకు గురి చేసింది. లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న అతిపెద్ద సినిమా కాబట్టి అందరిచూపు బాక్సాఫీస్ కలెక్షన్స్ పైనే ఉంది. అయితే సినిమా కోసం థియేటర్స్ లలో 100% సిట్టింగ్ కెపాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం దక్కలేదు.

విడుదలైన రోజే ప్లాప్ టాక్
కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల అనుమానాలను క్రియేట్ అయ్యాయి. పైగా విడుదలైన రోజే ప్లాప్ టాక్ దెబ్బ పడినట్లు టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయితే ఆ టాక్ తో సంబంధం లేకుండా సినిమా తమిళంలో మొదటిరోజు 50కోట్ల వసూళ్లను అందుకుంది.

సెంచరీ కొట్టేశాడు
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ మొదటిసారి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. అయితే ప్లాప్ టాక్ రావడం వలన కలెక్షన్స్ పై ఇక్కడ ఎఫెక్ట్ కొంత పడింది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ రేంజ్ అయితే మరోలా ఉండేది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా శనివారమే 100కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాస్టర్ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో కలెక్షన్స్ ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.