Just In
- 7 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 8 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 9 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 10 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Master Day 1 Collections: తెలుగులో మాస్టర్ రికార్డ్.. ఓవరాల్‌గా విజయ్ ఎంత వసూల్ చేశాడంటే!
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్. విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దీంతో తన ప్రతి సినిమానూ అన్ని ప్రాంతాల్లో విడుదల చేస్తూ కలెక్షన్లు రాబడుతున్నాడు. తద్వారా సినిమా సినిమాకూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విజయ్ నటించిన 'మాస్టర్' విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఆ వివరాలు మీకోసం!

‘ఖైదీ' దర్శకుడితో కోలీవుడ్ స్టార్ హీరో
‘ఖైదీ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘మాస్టర్'. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

సంక్రాంతికి మాస్టర్ మూవీ హంగామా
రజినీకాంత్ తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకడు. ఆయనకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా స్పందన భారీగా ఉంటోంది. ఇందులో భాగంగానే ‘మాస్టర్'కు కూడా ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. మరీ ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లో ఇది రిలీజ్ అయింది.

సూపర్ హిట్ నుంచి ఏవరేజ్‌గా నిలిచి
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మాస్టర్‌కు ప్రీమియర్ షోలలో మంచి స్పందన వచ్చింది. అయితే, మొదటి రోజు చివరకు టాక్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ బాగుందని చెబుతున్న ప్రేక్షకులు.. సెంకాడాఫ్ మాత్రం సాగదీతగా ఉందని అంటున్నారు. దీంతో కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపించాయని చెబుతున్నారు. ఫలితంగా సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది.
రెడ్ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ..రామ్ హంగామా చూడండి (ఫోటోలు)

అక్కడ హవా చూపించిన హీరో విజయ్
తమిళ సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో విజయ్ ఒకడు. అందులోనూ మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ‘మాస్టర్'లో నటించడంతో.. ఈ సినిమాకు అక్కడ మంచి స్పందన వచ్చింది. అభిమానుల కోలాహళం నడుమ మొదటిరోజు షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఫలితంగా ఈ సినిమా తమిళనాడులో దాదాపు రూ. 23 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసుకుంది.

తెలుగులోనూ రికార్డు క్రియేట్ చేశాడు
తెలుగులో ‘మాస్టర్' మూవీని ఈస్ట్ కోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు విడుదల చేశారు. టాలీవుడ్ సినిమాల స్థాయిలో ఎక్కువ థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి స్పందనే వచ్చింది. తద్వారా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.50 కోట్లు వసూలు చేసిందీ సినిమా. ఫలితంగా విజయ్ కెరీర్‌లోనే ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది.

ఓవరాల్‌గా ఎంత వసూలు చేశాడంటే!
బుధవారం ప్రపంచ వ్యాప్తంగా ‘మాస్టర్' మేనియానే కనిపించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. తమిళనాడులో రూ. 23 కోట్లు, కర్నాటకలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 3 కోట్లు, ఆంధ్రా+తెలంగాణలో రూ. 4.5 కోట్లు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లతో మొత్తంగా రూ. 40 కోట్లు రాబట్టి సత్తా చాటింది.