Don't Miss!
- News
Hyderabad: ప్రేమించిన యువతికి పెళ్లి.. మండపానికి వెళ్లిన ప్రియుడు.. కట్ చేస్తే ఆస్పత్రికి మారిన సీన్..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Sports
IND vs ENG: రిషభ్ పంత్ హాఫ్ సెంచరీ.. 49 ఏళ్ల తర్వాత అరుదైన ఘనత!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
- Finance
Free Shares: 50 వేలకు పైగా రైతులకు ఉచితంగా షేర్లు.. ఆరు రాష్ట్రాల్లోని వారికి ఉపయోగం..
- Lifestyle
Diabetic UTI :మధుమేహం UTI ప్రమాదాన్ని పెంచుతుంది, ఈ విధంగా సంక్రమణను నివారించవచ్చు..
Vikram 20 Days Collections: కమల్ హసన్ హవా అస్సలు తగ్గట్లేదు.. డబుల్ ప్రాఫిట్స్ కాదు.. అంతకుమించి!
బాక్సాఫీస్ హిట్ అంటే ఇలా ఉండాలి అని చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ తన స్టామినా ఏమిటో చూపించారు. అసలు మార్కెట్ లేదు అనుకున్న హీరో ఒక్కసారిగా సింహంలా జూలు విదిలించి బాక్సాఫీస్ పై దండయాత్ర మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపించారు. విక్రమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఊహించని స్థాయిలో లాభాలను అందిస్తోంది. ఇక థియేటర్స్ లోకి వచ్చి 20 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది పెట్టుబడి పెట్టినవారికి ఎంతగా లాభాలను అందించింది అనే వివరాల్లోకి వెళితే..

100కోట్ల బిజినెస్
కమల్ హాసన్ మేయిన్ హీరోగా విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన విక్రమ్ సినిమాకు మొదటి నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ తోనే సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
ఇక దేశవ్యాప్తంగా మంచి బిజినెస్ ఏర్పడింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా విక్రమ్ సినిమా వంద కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగులో అయితే ఈ సినిమా ఏడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల చేయడం జరిగింది

20వ రోజు ఎంత వచ్చిందంటే?
'విక్రమ్' సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక 20వ రోజూ ఆంధ్ర తెలంగాణలో కూడా కలెక్షన్స్ పరవాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఇక 19వ రోజు 15 లక్షల షేర్ అందుకున్న విక్రమ్ సినిమా 20వ రోజు మాత్రం కేవలం 13 లక్షల షేర్ రాబట్టింది. కొన్ని తెలుగు సినిమాలకు పోటీగా ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడం గొప్పే అని చెప్పవచ్చు.

మొత్తం 20 రోజుల షేర్
కమల్ హాసన్ 'విక్రమ్' ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 20 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 6.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.30 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 80 లక్షలు, గుంటూరులో రూ. 1.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 15.93 కోట్లు షేర్, రూ. 27.81 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్ కలెక్షన్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో రూ. 27.81 కోట్ల గ్రాస్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో అత్యధికంగా 162.40కోట్లు, కర్ణాటక 19.20 కోట్లు, కేరళ 35.80 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10.30 కోట్లు, ఓవర్సీస్ లో 116.85 కోట్లు వీటితో కలిపి 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ సినిమా రూ రూ. 373.36 కోట్లు గ్రాస్, 185.20 కోట్ల షేర్ వసూలు సాదించింది.

మొత్తం వచ్చిన లాభాలు ఎంతంటే?
కమల్ హాసన్ 'విక్రమ్' సినిమా వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో రూ. 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక తెలుగులో 20 రోజుల్లో రూ. 15.93 కోట్లు రావడంతో శ్రేష్ట్ మూవీస్ కు రూ. 8.43 కోట్ల ప్రాఫిట్స్ తో వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమాకు 85 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.