For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: చిరంజీవి సంచలన రికార్డు.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. వాల్తేరు వీరయ్య టార్గెట్ ఔట్

  |

  సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి ఏకధాటిగా సినిమాలు చేస్తూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఇది దుమ్ము దులుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి టార్గెట్ పూర్తి చేశారు. ఆ వివరాలు మీకోసం!

  వీరయ్యగా చిరంజీవి ఊరమాస్

  వీరయ్యగా చిరంజీవి ఊరమాస్

  మెగాస్టార్ చిరంజీవి - మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మాస్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

  హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

  ఇక్కడా.. అక్కడా భారీగా రిలీజ్

  ఇక్కడా.. అక్కడా భారీగా రిలీజ్


  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు ధీటుగానే ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాను అత్యధిక లొకేషన్లలో విడుదల చేశారు. ఇక, రెండో రోజు నుంచి ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్లను పెంచుతూ వచ్చారు.

  రికార్డు కలెక్షన్లతో అరాచకంగా

  రికార్డు కలెక్షన్లతో అరాచకంగా

  చిరంజీవి - రవితేజ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి మొదటి రోజు నుంచీ టాక్‌తో సంబంధం లేకుండానే స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఫస్ట్ అండ్ సెకెండ్ షోలు కూడా హౌస్‌ ఫుల్ బోర్డులతో కనిపించాయి. దీంతో ఈ చిత్రానికి చిరంజీవి కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్స్ దక్కాయి. రెండో రోజూ, మూడో రోజూ అదే కంటిన్యూ అవుతూ భారీ వసూళ్లు దక్కాయి.

  బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

  ఓవర్సీస్‌లో మరింత రెస్పాన్స్

  ఓవర్సీస్‌లో మరింత రెస్పాన్స్

  ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఓవర్సీస్‌లో భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ప్రీమియర్స్‌తో పాటు ఈ మూడు రోజుల్లోనూ భారీ వసూళ్లు దక్కాయి. ముఖ్యంగా ఈ సినిమాకు రోజుకు 3 లక్షల డాలర్లకు పైగానే కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం అక్కడ రెండో రోజే మిలియన్ మార్కును చేరుకుంది.

  మరో ఘనతను అందుకుంది

  మరో ఘనతను అందుకుంది

  చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి యూఎస్‌లో మొదటి రోజు నుంచీ భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమాకు దాదాపు అక్కడ కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూడు రోజుల్లో ఓవర్సీస్‌లో 1.7 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించారు.

  యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

  టార్గెట్ ఫినీష్ చేసిన సినిమా

  టార్గెట్ ఫినీష్ చేసిన సినిమా


  'వాల్తేరు వీరయ్య' మూవీ యూఎస్‌లో 1.6 మిలియన్ డాలర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ప్రీమియర్స్‌కు తక్కువ వసూళ్లు రావడంతో ఇది హిట్ అవుతుందా అనుకున్నారు. కానీ, క్రమంగా పుంజుకుని మూడు రోజుల్లోనే టార్గెట్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఓవర్సీస్‌లో ఈ సినిమా హిట్ అవడంతో పాటు బయ్యర్లకు లాభాలను అందిస్తోంది.

  నక్కతోక తొక్కిన శ్లోకా సంస్థ

  నక్కతోక తొక్కిన శ్లోకా సంస్థ

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ఇక, మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాల బాట పట్టింది. ఇక, మరో వారం రోజులు ఈ చిత్రం హవాను చూపించే అవకాశం ఉంది. దీంతో శ్లోకా సంస్థపై కాసుల వర్షం కురబోతుందని చెప్పొచ్చు.

  English summary
  Chiranjeevi and Ravi Teja Starrer Waltair Veerayya Movie Released January 13th Worldwide. Now This Movie Break Even Target Finished at Overseas.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X