Waltair Veerayya's Day 2 Collections.. చిరంజీవి కలెక్షన్ల ఊచకోత.. రెండో రోజుల్లోనే లాభాలతో రికార్డు!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ రచ్చ పీక్స్‌కు చేరుకొన్నది. టాక్‌తో సంబంధం లేకుండా విడుదలైన ప్రతీ చోట కాసుల కనకవర్షం కురిపిస్తున్నది. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ రికార్డు కలెక్షన్లను నమోదు చేస్తున్నది. తొలి రోజు భారీ కలెక్షన్లకు ధీటుగా వసూళ్లను రాబట్టడంతో ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఎంత అనే విషయంపై ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య రెండో రోజు ఎంత వసూళ్లు సాధించిందంటే?

వాల్తేరు వీరయ్య తొలి రోజు
వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు దేశవ్యాప్తంగా 30 కోట్లు సాధించింది. తెలుగులో 29.3 కోట్లు, హిందీలో 3 లక్షల రూపాయలు వసూలు చసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 49 కోట్లకుపైగా గ్రాస్, 30 కోట్ల షేర్ సాధించింది. చిరంజీవి కెరీర్‌లో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

హిందీలో పేలవంగా కలెక్షన్లు
హిందీలో రిలీజైన వాల్తేరు వీరయ్య ఉత్తరాది ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హిందీ వెర్షన్ పేలవమైన వసూళ్లను నమోదు చేసింది. హిందీ మార్కెట్‌పై అధిపత్యం సాధించాలనే మెగాస్టార్ నిర్ణయం వర్కవుట్ కాలేదనే విషయం వాల్తేరు వీరయ్య స్పష్టం చేసింది.

రెండో రోజు వాల్తేరు వీరయ్య ఆక్యుపెన్సీ
వాల్తేరు వీరయ్య సినిమా 2వ రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే. అత్యధికంగా కరీంనగర్‌లో 93 శాతం, కాకినాడలో 89 శాతం, నెల్లూరులో 96 శాతం, హైదరాబాద్‌లో 82 శాతం, విజయవాడలో 87 శాతం, వరంగల్‌లో 84 శాతం, వైజాగ్‌లో 89 శాతం అక్యుపెన్సీ సాధించాయి. బెంగళూరులో 63 శాతం, చెన్నైలో 79 శాతం, ఢిల్లీలో 20 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

అమెరికాలో బ్రేక్ ఈవెన్ సాధించి..
వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్‌లో భారీగా కుమ్మేస్తున్నది. ముఖ్యంగా అమెరికాలో రికార్డులు తిరగరాస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తున్నది. రెండో రోజు ఈ చిత్రం 349598 డాలర్లు అంటే సుమారు 3 కోట్లు రాబట్టింది. గత రెండురోజుల్లో ఈ చిత్రం 1.34 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 11 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అమెరికాలో ఈ చిత్రం రెండో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం రికార్డుగా మారింది.

రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా
ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 19 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రెండో రోజు దాదాపు 25 కోట్ల వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం. దాంతో ఈ చిత్రం 75 కోట్ల మైలురాయిని చేరింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

వాల్తేరు వీరయ్య లాభాల్లోకి రావాలంటే?
వాల్తేరు వీరయ్య తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 49 కోట్లు గ్రాస్, 29.3 కోట్ల షేర్ సాధించింది. రెండో రోజు కూడా మరో 25 కోట్ల గ్రాస్ రాబట్టడంతో ఈ చిత్రం ఈ చిత్రం సుమారు 75 కోట్ల గ్రాస్‌కు చేరువైంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద 89 కోట్లు రాబట్టాల్సి ఉంది. దాంతో ఈ చిత్రం మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణలో 2వ రోజు
ఏపీ, తెలంగాణలో వాల్తేరు వీరయ్య రెండో రోజు కలెక్షన్లను పరిశీలిస్తే.. ఉత్తరాంధ్రలో 1.45 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 88 లక్షలు, కృష్ణ జిల్లాలో 80 లక్షలు, నెల్లూరు జిల్లాలో 36 లక్షలు వసూలు చేసింది. ఈ చిత్రం ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 11 కోట్ల షేర్ సాధించింది.


Click it and Unblock the Notifications











