Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya 4 Days Collections: వీరయ్య మాస్ కొట్టుడు.. 4వ రోజూ రికార్డే.. టాప్ 5లోకి చిరంజీవి
కమ్ బ్యాక్ అయినప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలను ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఈ సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రానికి మొదట్లో మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. స్పందన మాత్రం భారీ స్థాయిలో వస్తోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'వాల్తేరు వీరయ్య' మూవీకి 4 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

వీరయ్యగా చిరంజీవి అరాచకం
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో వచ్చిన సినిమానే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా చేశారు.
ఐటెం గర్ల్ హాట్ వీడియో వైరల్: అడల్ట్ మూవీని తలపించేలా ఘోరంగా!

వీరయ్య ప్రీ బిజినెస్ వివారాలు
చిరంజీవి మార్కెట్ అనుగుణంగా 'వీర సింహా రెడ్డి' మూవీకి నైజాంలో రూ. 18 కోట్లు, సీడెడ్‌లో రూ. 15 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 39 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 72 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటలో రూ. 5 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లతో కలిపి.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల బిజినెస్ జరిగింది.

4వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'వాల్తేరు వీరయ్య'కు ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.02 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 47 లక్షలు, గుంటూరులో రూ. 70 లక్షలు, కృష్ణాలో రూ. 93 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో కలిపి.. రూ. 11.42 కోట్లు షేర్, రూ. 18.80 కోట్లు గ్రాస్ వచ్చింది.
జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్.. నిజంగా కుదరదు అంటూ!

4 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
4 రోజుల్లోనూ 'వాల్తేరు వీరయ్య' కలెక్షన్లు భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 20.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.36 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.35 కోట్లు, గుంటూరులో రూ. 4.81 కోట్లు, కృష్ణాలో రూ. 4.12 కోట్లు, నెల్లూరులో రూ. 2.22 కోట్లతో కలిపి.. రూ. 58.88 కోట్లు షేర్, రూ. 95.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
4 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 58.88 కోట్లు కొల్లగొట్టిన 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 4 రోజుల్లో ఈ మల్టీస్టారర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.68 కోట్లు షేర్, రూ. 127.75 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.
ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 89 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 73.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 15.32 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

టాప్ 5 చిత్రాల జాబితాలోకి ఎంట్రీ
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ సినిమా నాలుగో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.42 కోట్లు వసూలు చేసింది. తద్వారా 4వ రోజు హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో RRR, బాహుబలి 2, సర్కారు వారి పాట, అల.. వైకుంఠపురములో తర్వాత నిలిచింది.