War 2 Day 9 Box office Collectons: వార్ 2కి 9వ రోజు కలెక్షన్స్.. మరీ డ్రాప్ అయిన వసూళ్లు.. ఎంతంటే?
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన లేటెస్ట్ మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం మొదటి వారం దాటి, 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. రెండో వారంలో బాక్సాఫీస్ వసూళ్లు కాస్తా క్షీణించాయి. ఈ క్రమంలో వార్ 2 చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 9 రోజుల వసూళ్లు ఎంత? అనే వివరాల్లోకి వస్తే..
వార్ 2 బడ్జెట్ ఎంత?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాణ యష్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అషుతోష్ రాణా, అనిల్ కపూర్ వంటి స్టార్ కాస్ట్ నటించడం, టాప్ టెక్నీషియన్లు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడం భారీగానే ఖర్చైంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాల ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
వార్ 2 చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రైట్స్ ను టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ రూ.105 కోట్లతో సొంతం చేసుకున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కలుపుకొని రూ.19 కోట్లు, ఓవర్సీస్ హక్కులు ద్వారా రూ.56 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే ఓవర్సీస్, నాన్ థియేట్రికల్ తో మరో రూ.160 కోట్ల బిజినెస్ జరిగిందని, ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
వార్ 2కి 8 రోజుల ఇండియా నెట్..
ఓపెనింగ్ డే వార్ 2 చిత్రానికి రూ.52 కోట్ల నెట్, 2వ రోజు 58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు నెట్ వసూల్ చేసింది. ఇలా 8 రోజుల్లో ఇండియా నెట్ రూ.204.25 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
వార్ 2కి 9వ రోజు వసూళ్లు..
మొదటి వారం పూర్తైన తర్వాత వార్ 2 చిత్రానికి భారీగా వసూళ్లు తగ్గిపోయాయి. ఇక ఆగస్టు 22న శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు కేవలం 1 కోటీ రూపాయల నెట్ మాత్రమే వసూల్ చేసిందని సాక్ నిక్ తెలిపింది. ఇక మిగిలిన షోలు కలుపుకొని సినిమాకు 2 నుంచి 3 కోట్ల ఇండియా నెట్ వసూల్ కానుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక 9వ రోజు కేవలం 10 శాతం మాత్రమే థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.
వరల్డ్ వైడ్ గా..
వార్ 2కి 9వ రోజు వరకు స్టేట్ వైజ్ గా కలెక్షన్లు చూస్తే.. హిందీలో రూ.152 కోట్లు, తమిళంలో రూ.2 కోట్లు, తెలుగులో రూ.54 కోట్లు వసూలైంది. ఇలా ఇండియా నెట్ మొత్తం రూ.208 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇండియా గ్రాస్ రూ.250 కోట్లకు చేరుకుంది. ఓవరీస్ లో రూ.71 కోట్లు వసూళ్లు సాధించింది. దీంతో వరల్డ్ వైడ్ గా 9వ రోజు వరకు రూ.320 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ చిత్రం 280 కోట్లు వసూళ్లు చేస్తేనే సేఫ్ జోన్ లోకి రానుందని తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











