Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజనీ ‘కబాలి’ రెమ్యూనరేషన్ ఎంత? నిర్మాత అందుకే అలా చేసాడా?
హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజైన సంగతి తెలిసింతే. రజనీకి ఉన్న ఫాలోయింగ్, అభిమానుల్లో అతడంటే క్రేజ్ బాగా ఉండటం, విడుదల ముందు 'కబాలి' టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.
'కబాలి' సినిమాను కొనుగోలు చేసిన అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో దాదాపుగా తమ పెట్టుబడి రాబట్టుకున్నారు. సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ దాదాపు రూ. 200 కోట్ల వసూలు చేసింది. తమిళనాట కబాలి కలెక్షన్లు కాస్త స్డడీగా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో మాత్రం కలెక్షన్లు పడిపోయాయి.
'కబాలి' రిజల్ట్, హెల్త్ సమస్యలపై... ఫ్యాన్స్‌కు రజనీకాంత్ లేఖ (ఫోటోస్)
కాగా... 'కబాలి' సినిమాకు రజనీకాంత్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు రజనీకాంత్ ముందు రూ. 50 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నారట.
సాధారణంగా స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్‌గా పలు ఏరియాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ తీసుకుంటారు. కొంతకాలం క్రితం వరకు రజనీకూడా అలాగే తీసుకునే వారు. అయితే కొంతకాలంగా రజనీకాంత్ సినిమాల చుట్టూ రిస్కీ గేమ్ నడుస్తోంది. కొచ్చాడయాన్, లింగా సినిమాల విషయంలో ఎంత గొడవ జరిగిందో తెలిసిందే.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

రిస్క్ అని తెలిసి కూడా..
అందుకే ఈ సారి రజనీకాంత్‌కు నిర్మాత కలైపులి ఎస్.థాను రూ. 50 కోట్లు అడ్వాన్సు రెమ్యూనరేషన్ గా ఇచ్చి.... ‘కబాలి' సినిమాను ఎలాంటి రిస్క్ ఫేస్ చేయడానికైనా సిద్ధమై ఈ సినిమా చేసారు.

అందుకే..
రజనీకి రూ. 50 కోట్లు అడ్వాన్స్ ఇవ్వడంతో ద్వారా నిర్మాత మరింత ఫ్రీగా వ్యవహరించారు. భారీగా పబ్లిసిటీ చేసారు.

వాడేసారు..
ఇప్పటి వరకు రజనీకాంత్ ఏ కమర్షియల్ యాడ్స్ లోనూ నటించలేదు. కానీ కబాలి ముసుగులో రజనీ ఇమేజ్‍ను పలు కార్పొరేట్ సంస్థలకు యాడ్స్ కోసం అమ్మేసారు ఈ చిత్ర నిర్మాత.

రజనీ స్పందన..
కబాలి సినిమాకు నెగెటివ్ రివ్యూలు, మిక్డ్స్ టాక్ వచ్చినా... సినిమా వల్ల ఎవరూ నష్టపోలేదు కాబట్టి రజనీకాంత్ సంతృప్తి వ్యక్తం చేసారు.