»   » అజ్ఞాతవాసి బయ్యర్ల గుండెల్లో రైళ్లు.. దిల్ రాజుకు ఎదురుదెబ్బ?

అజ్ఞాతవాసి బయ్యర్ల గుండెల్లో రైళ్లు.. దిల్ రాజుకు ఎదురుదెబ్బ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే చెప్పలేనంత క్రేజ్. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో చిత్రం వస్తుందంటే మరింత క్రేజ్ ఉంటుంది. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత హ్యాట్రిక్ విజయాన్ని చేజిక్కించుకోవడానికి అజ్ఞాతవాసి వచ్చిన నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ప్రీ రిలీజ్ జరిగింది. అయితే ఈ సినిమాపై అనుకొన్నంత మేరకు స్పందన లేకపోవడం కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపుతున్నది.

'అజ్ఞాతవాసి' కలెక్షన్స్ చూస్తే షాకే !
 150 కోట్లకుపైగా బిజినెస్

150 కోట్లకుపైగా బిజినెస్

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనడంతో రిలీజ్‌కు ముందే రూ.150 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. డిస్టిబ్యూటర్లు భారీ మొత్తాలను చెల్లించి పంపిణీ హక్కులను దక్కించుకొన్నారు. భారీ కలెక్షన్లపై అంచనాలు పెంచుకొన్నారు.

 ప్రతికూల టాక్‌తో దెబ్బ

ప్రతికూల టాక్‌తో దెబ్బ

అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత పరిస్థితి తారుమారైంది. తొలి ఆట నుంచే డివైడ్ టాక్ కాకుండా ఫ్యాన్స్ నుంచే ప్రతికూల స్పందన వ్యక్తం కావడం సినిమా కలెక్షన్లపై దెబ్బ పడింది.

 కలెక్షన్లపై జై సింహా ఎఫెక్ట్

కలెక్షన్లపై జై సింహా ఎఫెక్ట్

అజ్ఞాతవాసి చిత్రానికి భారీగా అడ్వాన్సు బుకింగ్ జరుగడంతో తొలి, రెండో రోజు కలెక్షన్లు పెద్ద మొత్తంలో వచ్చాయి. అయితే జై సింహ, గ్యాంగ్ చిత్రాలు రావడంతో కొంత మొత్తంలో వసూళ్ల సన్నగిల్లే అవకాశం ఉంది.

 నికరంగా 150 కోట్ల వసూళ్లు

నికరంగా 150 కోట్ల వసూళ్లు

బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు గట్టెక్కాలంటే అజ్ఞాతవాసి చిత్రం నికరంగా రూ. 150 కోట్లు వసూలు చేయాల్సిందే. ఆ మొత్తంలో కలెక్షన్లు వస్తే తప్ప బయ్యర్లకు ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుంది.

 నష్టాల శాతం తగ్గే అవకాశం

నష్టాల శాతం తగ్గే అవకాశం

ఒకవేళ వారాంతంలో అజ్ఞాతవాసి చిత్రం పుంజుకొంటే ఏరియాల వారీగా నష్టాల శాతం తారుమారై అవకాశం ఉంది. ప్రధానంగా నైజాం, ఉత్తరాంధ్ర డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

నైజాంలో దిల్ రాజు భారీగా..

నైజాంలో దిల్ రాజు భారీగా..

అజ్ఞాతవాసి నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూ.29 కోట్లకు దక్కించుకున్నారనేది ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో దిల్ రాజుకు చుక్కలు కనపడుతున్నాయట. పండగ రోజుల్లో నమోదయ్యే వసూళ్లను బట్టే దిల్ రాజు లాభనష్టాలు ఎంతో తేలుతాయి.

 ఓవర్సీస్‌లోనూ అదే పరిస్థితి..

ఓవర్సీస్‌లోనూ అదే పరిస్థితి..

ఇక ఓవర్సీస్‌ హక్కులను సుమారు రూ.19 కోట్లు చెల్లించి ఎల్‌ఏ తెలుగు అనే సంస్థ దక్కించుకొన్నది. తొలిరోజు సుమారు రూ.15 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఉత్తర అమెరికాలో లాభాల్లోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు అనేది మీడియా టాక్.

English summary
The distributors have made plans for a massive release of Agnyaathavaasi movie across Globe. They have already booked 576 screens in the USA and are still finding more to add theaters to it which is a very big release for any Indian movie. While negetive talk spread on the movie makes dull collections all over the world. Agnyaathavaasi movie made nearly Rs. 150 crores pre release business.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X