»   » ‘ఎవడు’ కలెక్షన్స్: బాక్సు బద్దలైందిరోయ్!

‘ఎవడు’ కలెక్షన్స్: బాక్సు బద్దలైందిరోయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన 'ఎవడు' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఆదివారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే ఏపీ బాక్సాఫీ వద్ద దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మాస్ మసాలా, యాక్షన్, కామెడీ, మ్యూజిక్ లాంటి ఫుల్లీ లోడెడ్ కమర్షియల్ అంశాలతో సినిమా ఉండటంతో పాటు పండగ సీజన్ కావడంతో థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. మరో వైపు ఈ సినిమాతో పాటు విడుదలైన మహేష్ బాబు '1 నేనొక్కడినే' చిత్రానికి నెగెటివ్ టాక్ రావడం కూడా చరణ్‌కు కలిసొచ్చింది.

'Yevadu' box oOffice report

'ఎవడు' మూవీ సక్సెస్ మీట్లో దిల్ రాజు మాట్లాడుతూ....'ఎవడు సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. విడుదల లేటవుతుందని కొన్ని సార్లు నిరాశ పడ్డాను. కానీ విడుదలైన తర్వాత బాక్సాఫీసు వద్ద ఫలితాలను మమ్మలి ఎంతో ఆనంద పరుస్తున్నాయి. మా బేనర్లో ఇప్పటి వరకు తీసిన 16 సినిమాల కంటే ఈచిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, అమీ జాక్సన్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అల్లు అర్జున్, కాజల్ ఈచిత్రంలో అతిథి పాత్రల్లో నటించారు. దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ ''ఇది నా మూడో సినిమా. పూర్తి సంతృప్తిని ఇచ్చిన సినిమా కూడా ఇదే. రామ్‌చరణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న కథ ఇది. అల్లు అర్జున్‌ లేకపోతే ఈ సినిమా ముందుకు వెళ్లేది కాదు. అబ్బూరి రవి అందించిన మాటలు, దేవిశ్రీ సంగీతం.. ఇలా ఒక్కటి కాదు, ప్రతీ విభాగం నాకు తోడ్పడింది. కష్టకాలంలో నాకు తోడుగా నిలిచినవాళ్లందరికీ నా కృతజ్ఞతలు'' అన్నారు.

English summary

 Ram Charan's "Yevadu" has taken a fantastic opening at the Andhra Pradesh box office. The film’s AP share is hovering around the 20Cr mark already and the makers are gearing up for a super strong Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu