»   » సంక్రాంతి విన్నర్ ఎవరంటే... (ట్రేడ్ టాక్)

సంక్రాంతి విన్నర్ ఎవరంటే... (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి సీజన్‌ని మించినది లేదన్నది సినిమావాళ్ల నమ్మకం. వరుసగా సెలవులు వస్తాయి. ఇంటిల్లిపాదీ విందు, వినోదాల్ని ఆస్వాదించే మూడ్‌లో ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్ల వరకూ తీసుకురావడం తేలికైన విషయం. అదే నమ్ముతూ '1', 'ఎవడు' సినిమాలు ఈ సంక్రాంతికి వచ్చేసాయి. అయితే 'ఎవడు' మాత్రమే కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్ లో ఉంటూ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. '1' చిత్రం సినీ లవర్స్ నుంచి ప్రశంసలు పొందుతున్నా కలెక్షన్స్ పరంగా నిలబడలేకపోతోంది.

Yevadu Won Sankranthi While 1 Impresses

ఎప్పటినుండో 'ఎవడు' చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అనేక అవాంతరాలను ఎదుర్కొని '1'కు పోటీగా దిగింది. ఈ రెండు చిత్రాలు పండగకు వచ్చి సందడే చేస్తున్నాయి. '1' చిత్రం కొంత నిడివి తగ్గించి,ప్రమోషన్ పెంచాక కలెక్షన్స్ ఓకే అనిపించినా పోటీ ఇచ్చే పరిస్ధితుల్లో లేదని ట్రేడ్ లో వస్తున్న కలెక్షన్స్ ని బట్టి తెలుస్తోంది. అలాగే యువ ప్రేక్షకులు, కుటుంబం ప్రేక్షకులు 'ఎవడు' చిత్రానికి క్యూ కడుతున్నారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

ఇక సంక్రాంతి సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా జనం ఆదరిస్తారనే భరోసా నిర్మాతలది. అయితే ఇప్పుడు మాత్రం ఆ అవకాశం లేదు. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి ఢీ కొట్టుకొంటే చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమే. ఇప్పుడు జరుగుతోంది అదే. ఎక్కడ చూసినా ఈ పోస్టర్లే. మూడో సినిమాకి దారే లేదు. అందుకే నిర్మాతలు ధైర్యం చేయ లేదు. 'సంక్రాంతి వెళ్లిన తరవాత సినిమాను విడుదల చేద్దాం లే..' అనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ వేచి చూసే ధోరణి ఈ మధ్య మరీ ఎక్కువైంది. అందుకే సంక్రాంతి తరవాత పెద్ద ఎత్తున సినిమాలు రానున్నాయి. పండగ సంబరాల్ని కొనసాగించనున్నాయి.

English summary
This time Mahesh Babu came with 1Nenokkadine followed by Ram Charan’s Yevadu. Finally, this Sankranthi winner is decided. He is none other than Ram Charan. Yevadu became Sankranthi winner. Even though the craze for Mahesh Babu and his film made 1 Nenokkadine movie a different experience to all the viewers that they didnt experienced this kind of film ever in Telugu Film Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu