X
హోమ్ » సెలెబ్స్ » యన్ టి రామారావు
యన్ టి రామారావు

యన్ టి రామారావు

Actor/Director/Producer
బయోగ్రఫీ:  పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటునిగా ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్విత స్థానాన్ని సంపాదించుకున్నాడు...అలాగే తన నటన రాజకీయ సామర్థంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశాడు. నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద్రప్రదేశ్ లో జన్మించారు. బాల్యంలోనే సంస్కృతశ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు... ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ 'మనదేశం' చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు. 1982 సం.. లో తెలుగు ప్రజల కోరిక మేరకు...మరియు తెలుగువాడి ఆత్మభిమానానికి జరిగిన అవమానాన్ని ప్రతిపాదికగా తీసుకుని సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు... పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలోనటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు.
మరింత చదవండి

యన్ టి రామారావు సినిమాలు

యన్ టి రామారావు:

యన్ టి రామారావు

పేరు యన్ టి రామారావు
పుట్టిన రోజు 28 May 1923
వయసు 103
పుట్టిన స్థలం నిమ్మకూరు గ్రామం, క్రిష్ణ జిల్లా, ఆంద�
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

యన్ టి రామారావు ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+