»   » మెమరీ లాస్ పేషెంట్ గా మహేష్ బాబు?

మెమరీ లాస్ పేషెంట్ గా మహేష్ బాబు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫిల్మ్ సర్కిల్సో లో ఇప్పుడో కొత్త టాక్ మొదలైంది. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1'(నేనొక్కడినే) హాలీవుడ్ చిత్రం బోర్న్ ఐడెంటిటీ కాపీ అని, ఈ చిత్రంలో మహేష్ మెమెరీ లాస్ పేషెంట్ గా కనపిస్తారని. ఈ మేరకు కొన్ని తెలుగు టీవీ ఛానెల్స్ లో వార్తలు సైతం ప్రసారం కావటం జరిగింది. మొన్న మహేష్ పుట్టిన రోజున వదిలిన టీజర్ చూసిన కొందరు అందులో స్టైలిష్ నెస్, కొన్ని షాట్స్ ని చూసి ఈ రకంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

2014 సంక్రాంతి స్పెషల్ గా వస్తుందని చెప్పబడుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. టీజర్ లోని విజువల్స్ చూసిన వారు సుకుమార్ చాలా జాగ్రత్తగా,ప్రతీ ఫ్రేమ్ ప్లానెడ్ గా తీస్తున్నాడని అర్దం చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని విధంగా యాక్షన్ సీన్స్ ...ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో మహేష్...మూడు షేడ్స్ కలిగిన పాత్రలో కనిపిస్తాడంటున్నారు. సినిమా విజువల్ ట్రీట్ లా ఉంటుందని వినికిడి.

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు. గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ...మూడు రోజుల్లోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే మహేష్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన రెండో టీజర్ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. లండన్ షెడ్యూల్ పూర్తి కావచ్చింది. జనవరి 10, 2014న సంక్రాంతి కానుకగా వరల్డ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.

మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu is currently busy with the shooting of his new movie 1-Nenokkadine and recently a new teaser of the film was released. Those who saw it are coming up with an observation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu