ప్రభాస్ కోసం నాగ్ అశ్విన్ భారీ స్కెచ్.. ఊహించని రీతిలో పది మంది స్టార్స్?
బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత సాహో అనే సినిమా చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తూ మంచి దర్శకులను ఎంపిక చేసుకుని దాదాపు రాధేశ్యామ్ తర్వాత మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా అందులో ఒక ప్యాన్ ఇండియా ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

రాధేశ్యామ్ తో బిజీ
భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్లు సాధించింది కానీ హిట్ టాక్ రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రాధేశ్యామ్ సినిమా కూడా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. .

నాలుగు సినిమాలు లైన్ లో
రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ముందుగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ అనౌన్స్ చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితం కాబోతోంది. ఈ సినిమాని అనౌన్స్ చేశాక ఆయన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమాని అనౌన్స్ చేశాడు. అలాగే కేజిఎఫ్ సినిమాతో కన్నడ సినిమా ఖ్యాతిని భారత వ్యాప్తంగా చాటిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్నాడు.

తప్పుకున్న దర్శకుడు
ఇక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా కోసం పని చేస్తారని ముందు వైజయంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. తాజాగా సినిమా నుంచి సింగీతం శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని కూడా ప్రచారం జరిగింది. సినిమా డైరెక్షన్ టీంతో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చిన కారణంగా ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది.

ఏకంగా అంత మంది బాలీవుడ్ బడా స్టార్లు
తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగ్ అశ్విన్ ఈ సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కించడానికి అన్ని అస్త్రాలు బయటకు తీస్తున్నాడు. ప్రభాస్ 21లో బాహుబలి స్టార్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో నటించనున్నారు. వీరు మాత్రమే కాక బి-టౌన్ నుండి చాలా మంది స్టార్స్ ను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

విలన్ కూడా అక్కడి నుంచే
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బాలీవుడ్ స్టార్ నటుడు ఈ సినిమాలో విలన్ గా నటింపచేసేందుకుగాను నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. ఆయన కాకుండా బాలీవుడ్ లో ఉన్న ఐదారుగురు ప్రముఖ నటులను ఇతర ముఖ్య పాత్రల కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. మొత్తం మీద, ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి సుమారు 10 మంది అగ్ర నటులు కీలక పాత్రలు పోషించనున్నారని అంటున్నారు. ప్యాన్ వరల్డ్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్న నేపధ్యంలో మార్కెట్ పెంచుకునేందుకు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.
Recommended Video

షూట్ అప్పటి నుండే
మరోపక్క నాగ్ అశ్విన్ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రభాస్ 2022 మొత్తం ఈ సినిమా కోసం కేటాయించినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











