»   » షాకింగ్: అఖిల్ రెండో సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్!

షాకింగ్: అఖిల్ రెండో సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ కూడా ‘అఖిల్' కావడం విశేషం.

అఖిల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో తొలి సినిమాకు భారీగానే ఖర్చు పెట్టారు. ఖర్చుకు తగినవిధంగానే సినిమా విడుదల ముందు హైప్ కూడా బాగానే వచ్చింది. అయితే ఇది అఖిల్ తొలి సినిమా మాత్రమే కావడంతో.... మార్కెట్లో అతని రేంజి ఏమిటీ అనేది ఎవరూ అంచనా వేయలేక పోతున్నారు. వివి వినాయక్ దర్శకుడు కావడం, నాగార్జున ఫ్యామిలీనుండి వస్తున్న వారసుడు కావడం, ఇప్పటికే విడుదలైన ట్రైలర్లలో అఖిల్ డాన్సులు, ఫైట్లు బాగానే చేస్తుండటంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై నమ్మకంగానే ఉన్నారు.


12 cr offer for Akkineni Akhil

ఆ సంగతి పక్కన పెడితే ఇంకా అఖిల్ తొలి సినిమా విడుదల కానేలేదు... ఓ నిర్మాత ఇచ్చిన ఆఫర్ హాట్ టాపిక్ అయింది. ‘అఖిల్' సినిమా విడుదల ముందే వస్తున్న రెస్పాన్స్ చూసి....ఓ నిర్మాత అఖిల్ రెండో సినిమా కోసం 12 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. ఈ రేంజి రెమ్యూనరేషన్ ప్రస్తుతం రామ్ చరణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, రవితేజ లాంటి వారికే ఉంది. మరి ఇంకా ఓన మాలు దశలోనే ఉన్న అఖిల్ కు నిర్మాత రూ. 12 కోట్లు ఆఫర్ చేసాడనే వార్త ఇపుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


అఖిల్ సినిమా విషయానికొస్తే...
అఖిల్ అక్కినేని, సయేషా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమలతతో పాటు లండన్‌కు చెందిన లెబానా జీన్, లూయిస్ పాస్కల్, ముతినే కెల్లున్ తనాక, రష్యాకు చెందిన గిబ్సన్ బైరన్ జేమ్స్ విలన్స్ గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్, అనూప్, థమన్, అమోల్ రాథోడ్, రవివర్మ, ఎ.ఎస్.ప్రకాష్, గౌతం రాజు, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జాని సాంకేతిక నిపుణులు. ఈచిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: నిఖితా రెడ్డి, నిర్మాత: నితిన్, దర్శకత్వం: వి.వి.వినాయక్.

English summary
Film Nagar source said that, a producer approached Akhil and offered 12 cr for his next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu