»   » కొత్త కుర్రాడు...50 కోట్లు...పూరి జగన్నాథ్

కొత్త కుర్రాడు...50 కోట్లు...పూరి జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఓ ట్రాక్ రికార్డు ఉంది. అది ఆయన తన దర్శకత్వంలో పరిచయం చేసిన ఇద్దరు హీరోలు(రామ్ చరణ్, పునీత్ రాజ్ కుమార్) టాప్ స్దాయికి వెళ్లటం. దాంతో ప్రముఖులు తమ పిల్లలను మాస్ హీరో చెయ్యాలంటే పూరిని ఆశ్రయించాలనిపించేత డిమాండ్ క్రియేట్ అయ్యింది. అయితే పూరి ...చాలా స్ట్రాటజీగా ఎవరిని పడితే వారిని కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని లాంచ్ చేసి హిట్ కొడుతూంటారు. ఇప్పుడు అలాంటి అవకాశమే భారీగా పూరి ముంగిట వాలిందని సమాచారం. చిత్రం ఆగస్టులో లాంచ్ చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లాంచ్ అవ్వాలని ఒకప్పటి ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ గౌడ కు ఉంది. అదీ భారీగా లాంచ్ అవ్వాలనే ఆశయం. దాంతో 50 కోట్లు ఖర్చు పెట్టి పూరి తో సినిమా చేయాలని ఫిక్సయ్యారు. ఎలాగో కుర్రాడుకు రెమ్యునేషన్ ఉండదు.కాబట్టి మిగతా డబ్బుతో భారీగా, రిచ్ గా తీయాలని చెప్పినట్లు సమాచారం. పూరికు సైతం భారీగానే రెమ్యునేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి పూరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

ఇంతకీ కొత్త కుర్రాడిని 50 కోట్ల ఖర్చుతో ఇంట్రడ్యూస్ చెయ్యాలంటే పూరి ఏం చేస్తారు అనేది ఇప్పుడు అంతటా చర్చగా మారింది. ఈ చిత్రాన్ని కన్నడ,తెలుగు భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పెద్ద కన్నడ చిత్రం సైతం ...బడ్జెట్ 25 కోట్లు దాటదు. లిమిటెడ్ మార్కెట్ కావటంతో అంతకు మించి పెట్టడానికి ఆసక్తి చూపరు. అయితే ఒక్కసారిగా... అతన్నీ మాస్ స్టార్ ని చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

50 crs allotted to Puri for introducing Nikhil Gowda

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్...

ఛార్మితో చేస్తున్న జ్యోతిలక్ష్మి చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. రీసెంట్ గా ...ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు. ఆ ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు. టీజర్ చూస్తుంటే.... ఇది స్త్రీ వాద సినిమాగా స్పష్టమవుతోంది. స్త్రీ జాతిపై మగజాతి ఆధిపత్యాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని టీజర్లో విడుదల చేసిన లైన్స్ చూస్తే స్పష్టం వుతోంది. జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది.

ఆ ఫస్ట్ లుక్ టీజర్ లో భాస్కరభట్ల రాసిన సాంగ్ ఇలా సాగుతుంది...

‘చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్లం అయిపోయామా... వంటింటి కుందేళ్లలాగా వందేళ్లయినా బ్రతికేద్దామా...ఆడోళ్లం ఆడోళ్లం మనం తోడేళ్లతో ఉంటున్నామా...ప్రాణాలు తోడేస్తూ ఉన్న నోరు మూసుకూర్చుందామా...'

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
Puri jagannath is going to direct Deva Gowda’s grandson Nikhil Gowda. This film will be launched in August and will be released in Telugu too.As per reports Puri has been offered a whopping amount of Rs 50 crores to make the debut film of Nikhil Gowda.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu