»   »  స్టార్ హీరో సినిమాలో హైలెట్: ‘నాన్నకు ప్రేమతో’స్ఫూఫ్

స్టార్ హీరో సినిమాలో హైలెట్: ‘నాన్నకు ప్రేమతో’స్ఫూఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హిట్ సినిమా స్ఫూఫ్ చేసి నవ్వించటం తొలినుంచి మన డైరక్టర్స్ కు అలవాటే. అదే పద్దతిలో ఇప్పుడు ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం స్ఫూఫ్ ని ఓ పెద్ద హీరో చిత్రంలో పెట్టబోతున్నారు. అదే సినిమాకు హైలెట్ అవుతుందంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు వెంకటేష్ హీరోగా రూపొందుతున్న బాబు బంగారం.

ఈ చిత్రంలో నాన్నకు ప్రేమతో స్ఫూప్ చేసారని, ఆ స్ఫూఫ్ సప్తగిరిపై చిత్రీకరించారని చెప్తున్నారు. ఈ స్ఫూఫ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. సినిమాకు హైలెట్ గా ఈ స్ఫూఫ్ నిలుస్తుందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం అవుతుంది. దాదాపు పదినిముషాలు పాటు నాన్ స్టాఫ్ గా ఈ ఫన్ సాగుతుందని, మారుతి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని చిత్రీకరించినట్లు చెప్తున్నారు.

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ మీద చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ సైతం హైలెట్ అని చెప్తున్నారు. 'వెంకటేసూ...వెంకటేసూ..దగ్గుపాటి బాసూ..బాబు మనసు అచ్చమైన బంగారం గొలుసు.. ' అంటూ ఈ సాంగ్ సాగుతుందిట.

A spoof on Naannaku Premato:Babu Bangaram movie highlight !!

మారుతి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాబు బంగారం'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం. గిబ్రన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 'లక్ష్మీ', 'తులసి' చిత్రాల తరువాత మళ్లీ నటి నయనతార ఈ సినిమాలో వెంకటేశ్‌కు జతగా నటిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ, 'ఫ్యామిలీ చిత్రాల కథానాయికుడిగా వెంకటేష్‌ మంచి పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఆయన మరోసారి తన మార్క్‌ వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు. వెంకటేష్‌ నుంచి ప్రేక్షకులు కోరుకునే కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. యూత్‌, మాస్‌ ఆడియెన్స్‌కి నచ్చే అంశాలను సైతం మేళవించి ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిస్తున్నాం.

దర్శకుడు మారుతి వెంకటేష్‌ పాత్రను చాలా వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆద్యంతం వైవిధ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం మా బ్యానర్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు.

English summary
Inside talk is Babu Bangaram will have a spoof on NTR's hit film Naannaku Premato.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu