For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరిగి చేటయ్యింది: ఆగడు-ప్రకాష్ రాజ్ వివాదం(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఇప్పుడు అంతటా వినిపిస్తున్నది ప్రకాష్ రాజ్-ఆగడు టీమ్ కు జరిగిన వివాదమే. ఈ వివాదం మొదట్లో గుట్టు చప్పుడు కాకుండా ముగిసిపోతుందని అంతా భావించారు. అయితే ఈ మ్యాటర్ డైరక్టర్స్ అశోశియేషన్ సీరియస్ గా తీసుకోవటంతో అనుకున్నంత ఈజీగా ముగిసేటట్లు లేదని సమాచారం. బ్యాన్ పెట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.

  దర్శకుల సంఘం వారు తమ సభ్యులకు ఈ వివాదం విషయమై మెసేజ్ లు సైతం పంపారు. ఈ నేపధ్యంలో అంతటా ఈ విషయమై ప్రాచుర్యం లభించినట్లైంది. అందరూ అసలేం జరిగింది..ప్రకాష్ రాజ్ ఏమన్నారు అంటూ తమ పరిధిలో ఎంక్వైరీలు చేస్తున్నారు.

  మరో ప్రక్క ప్రకాష్ రాజ్ ని తీసేసి ఆ ప్లేస్ లో సోనూ సూద్ ని తీసుకుని ఆగడు టీమ్ షూటింగ్ మొదలెట్టింది. అంతేకాకుండా 75 లక్షలు వరకూ ప్రకాష్ రాజ్ నుంచి వసూలు చేయాలని అడుగుతున్నట్లు సమాచారం.

  మిగతా వివరాలు స్లైడ్ షోలో...

  అదే సమస్య

  అదే సమస్య

  ప్రకాష్ రాజ్ ఇంతకు ముందులా కేవలం నటుడుగానే ఉండకుండా దర్శకుడు అవతారం ఎత్తి ఉలవచారు బిర్యాని అనే చిత్రం చేస్తున్నారు. దాంతో ఆయన ఆ బిజీలో ఉంటూ తను ఇతర సినిమాలకు ఇచ్చిన డేట్స్ కు సరిగా హాజరు కావటం లేదు. అదే పద్దతిలో ఆగడు టీమ్ కూడా ఇబ్బంది పడిందని సమాచారం.

  కంప్లైంట్ కు కారణం

  కంప్లైంట్ కు కారణం

  షూటింగ్ స్పాట్ కు ప్రకాష్ రాజ్ ఎప్పుడూ లేటేనని, వచ్చి అసెస్టెంట్ డైరక్టర్స్ పై అరవటం వంటివి చేయటం జరిగేదని చెప్తున్నారు. అయితే ఓ రోజు అసెస్టెంట్ డైరక్టర్ ని విపరీతంగా తిట్టాడని దాంతో అతనే దర్శకుల సంఘంలో కంప్లైట్ చేసాడని సమాచారం.

  శ్రీను వైట్ల సర్ది చెప్పినా

  శ్రీను వైట్ల సర్ది చెప్పినా

  ప్రకాష్ రాజ్ విచిత్రమైన ప్రవర్తనతో విసిగినా షూటింగ్ కి ఇబ్బంది కలగకూడదని భావించిన శ్రీను వైట్ల ఆయనకు సర్ది చెప్దామని చాలా ప్రయత్నించాడు. అయితే తను ఇక షూటింగ్ రానని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు.

  సీన్ లోకి సోనూసూద్

  సీన్ లోకి సోనూసూద్

  దూకుడులో విలన్ గా చేసిన సోనూసూద్...ని వెంటనే రప్పించి ఆ సీన్స్ అతనిపై షూట్ చేయటం శ్రీను వైట్ల మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ షాక్ అయ్యాడట

  మహేష్ బాబు మౌనం

  మహేష్ బాబు మౌనం

  ఈ వివాదంలో మొదటి నుంచీ దూరంగా ఉంటూ వచ్చిన వారు మహేష్ బాబు అంటున్నారు. ప్రకాష్ రాజ్ తో గతంలో అనేక చిత్రాలు చేసిన మహేష్ బాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగానే మౌనంగా ఉండి,ఎవరికీ సపోర్టు చేయలేదని అంటున్నారు.

  వివాదంలోకి దిల్ రాజు

  వివాదంలోకి దిల్ రాజు

  ప్రకాష్ రాజ్ కి తెలుగు పరిశ్రమలో సన్నిహితుడు ఎవరూ అంటే దిల్ రాజు. ఆయన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే ప్రకాష్ రాజ్ అంటే దిల్ రాజు కు మంచి అభిమానం. దాంతో తన తరుపు మనిషిగా దిల్ రాజుని ఈ వివాదం పరిష్కరించమని పంపాడని సమాచారం.

  ఫైన్ కట్టాల్సిందే

  ఫైన్ కట్టాల్సిందే

  ఆగడు చిత్రం నిర్మాతల నుంచి ప్రకాష్ రాజ్ తీసుకున్న 75 లక్షలు తిరిగి చెల్లించి, లక్ష రూపాయలు ఫైన్ గా కట్టాలని దర్శకుల మండలి తీర్మానించినట్లు సమాచారం.

  బ్రహ్మాజీని తిట్టాడంటూ

  బ్రహ్మాజీని తిట్టాడంటూ

  ఇదిలా ఉంటే తనతోటి నటుడు బ్రహ్మాజి ని సైతం సెట్ లో ప్రకాష్ రాజ్ తిట్టాడంటూ వార్తలు వచ్చాయి. షూటింగ్ సమయంలో జరిగిన చిన్న గొడవ పెద్దదై బ్రహ్మాజీపై సీరియస్ అయ్యి...శ్రీను వైట్ల ను షూటింగ్ కాన్సిల్ చేయమని చెప్పి వెళ్లిపోయాడంటున్నారు.

  కొత్తేమీ కాదు

  కొత్తేమీ కాదు

  ప్రకాష్ రాజ్ తో ఇలాంటి తగాదాలు, సమస్యలు కొత్తమే కాదని ఆయనతో పనిచేసిన వారు అంటున్నారు. ఆయన ఎవరి మాటా వినరని, చెప్పిన డేట్స్ కు రారని, డబ్బింగ్ అయితే ఆయన ఎక్కడుంటే అక్కడకి వెళ్లి చెప్పించుకోవాల్సిన పరిస్ధితులు ఉంటాయని చాలా ఇబ్బందులు పెడతారని అంటున్నారు.

  రేసు గుర్రం

  రేసు గుర్రం

  ప్రకాష్ రాజ్ డేట్స్ సమస్య రేసుగుర్రం సినిమాకు వచ్చిందని, అందుకే ఆ సినిమాకు ప్రకాష్ రాజ్ పాత్రకు ఫినిషింగ్ ఇవ్వలేకపోయాడని అంటున్నారు.

  బ్యాన్

  బ్యాన్

  ప్రకాష్ రాజ్ పై గతంలో బ్యాన్ పెట్టారు...ఆయనతో సినిమాలు చేయకూడదని దర్శక,నిర్మాతల మండలిలు తీర్మానించాయి. అయితే మళ్లీ అంతటి నటుడు దొరక్కో మరేమో కానీ ఆ బ్యాన్ ని పెద్ద నిర్మాతలే ప్రక్కన పెట్టి ఆయన్ను ఎంకరేజ్ చేసారు.

  వినాయిక్ సినిమాలో..

  వినాయిక్ సినిమాలో..


  ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేతిలో ఉన్న పెద్ద సినిమా వివి వినాయిక్ ది. అందులో ఆయన ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. ఆ విషయం ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మరీ తెలిపారు.

  English summary
  
 Prakash Raj was replaced by Sonu Sood and Aagadu makers started shooting the film. Inside talk is Prakash Raj was shunted out of the project as he abused an assistant director. Even before the matter could be solved assistant director lodged complaint against Prakash Raj with the Directors Council.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X