కూలి ఎఫెక్ట్.. లోకేష్ కనగరాజ్‌కు అమీర్ ఖాన్ షాకింగ్ న్యూస్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్, లియో వంటి చిత్రాలతో ఆయన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఆయన దర్శకత్వ ప్రతిభకు మంచి ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆయన దర్శకత్వంలో కలిసి నటించేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో నయా ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకోవడానికి ముహూర్తాలు సెట్ అయ్యాయి.
రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రం కూలీ పెద్దగా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక భారీతారాగణం కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ నుంచి రియల్ హీరో ఉపేంద్ర, తమిళం నుంచి సౌబిన్ షహిర్ కీలక పాత్రలు పోషించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు.

అయితే లోకేష్ కనగరాజ్ గతంలో దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో సూర్యను ఏ స్థాయిలో చూపించారో, ఇక కూలి చిత్రంలో కూడా అమీర్ ఖాన్ ను కూడా అదే తరహాలో చూపిస్తారని అంతా భావించారు. కానీ అమీర్ ఖాన్ నటించిన దాదా పాత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన సూపర్ హీరో ఫిల్మ్ ఉంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.
లోకేష్ కనగరాజ్ - అమీర్ ఖాన్ కాంబినేషన్ లో రావాల్సిన సూపర్ హీరో ఫిల్మ్ షెడ్డుకు వెళ్లిందని అంటున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ లోకేష్ కనగరాజ్ తో చేసే ఆసక్తిలో లేరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ మరోవైపు తమిళ స్టార్ కార్తీతో ఖైదీ 2 చిత్రం, మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ గ్యాంగ్ స్టర్ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారంట.
ఆ కారణంగా కూడా లోకేష్ కనగరాజ్ అమీర్ ఖాన్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోవాల్సిన చిత్రం ఆగిపోయిందని అంటున్నారు. మరోవైపు అమీర్ ఖాన్ కూడా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటించబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ కోసమే అమీర్ ఖాన్ లోకేష్ కగనరాజ్ కు హ్యాండించారని తెలుస్తోంది. ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ చిత్రం రూ.350 కోట్లతో రూపుదిద్దుకుంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా టోటల్ గా రూ.675 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.


Click it and Unblock the Notifications











