For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఠాగూర్ టైప్ క్లైమాక్స్ తో... 'కెమెరామెన్‌ గంగతో...' ?

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం క్లైమాక్స్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ఠాగూర్ తరహా లో మాదిరిగా ఉంటుందని వినిపిస్తోంది. ఠాగూర్ లో చిరంజీవి కి మద్దతు ఇవ్వటం కోసం జనం మొత్తం ఎక్కడెక్కడివాళ్లు వచ్చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వటానికి ఎక్కడెక్కడ జనం వస్తారని, వారందరూ పవన్ మీడియా ద్వారా చేసే పనులకు ప్రేరితులు అయిన వారు ఉంటారని చెప్తున్నారు. అందుకే అబిమానలు సమక్షంలో ఈ సీన్ ని తీయాలని పూరి ప్లాన్ చేసారని అంటున్నారు.

  ఇక ఈ చిత్రంలో పవన్ మెకానిక్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. అనుకోని విధంగా మీడియాలోకి వచ్చి సంచలనం అవతాడని అంటున్నారు. సమాజాన్ని మెకానిజం చేసి హైలెట్ అవుతాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో సూపర్ హిట్ లాటిన్ అమెరికన్ పాప్ సాంగ్ 'Riva Riva Rivala Matha'ని ఎడాప్ట్ చేసారు. ఈ పాట పబ్ సాంగ్ గా వస్తుందని తెలుస్తోంది. విలన్స్ ని పవన్ కొడుతూండగా...బ్యాక్ గ్రౌండ్ లో స్కార్లెట్‌ విల్సన్‌ డాన్స్ చేస్తూంటుంది. ఈ పాట హైలెట్ కానుంది.

  ఇక ఈ పాటని సారధి స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే . ఆ సాంగ్ తో పవన్‌తో కలిసి విదేశీ నర్తకి స్కార్లెట్‌ విల్సన్‌ ఆడిపాడింది. ఆమె డాన్స్ కు ముగ్దుడైన పూరీ చివరి రోజున ఓ కాస్ట్ లీ ఐ ఫోన్ 4S ని గిప్ట్ గా ఇచ్చారు. ఈ పాట సినిమాలో హైలెట్ అవనుందని సమాచారం.ఇక శ్రీకాకుళం యాసలో హుషారుగా సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రాశారు. లండన్‌కి చెందిన స్కార్లెట్‌ హిందీలో 'షాంఘై' అనే చిత్రంలో ఐటెమ్‌ గీతం చేసింది. ఇటీవలే రామ్‌చరణ్‌ చిత్రం 'ఎవడు'లోనూ నర్తించింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.

  అక్టోబర్ 3వ తేదీ నాటికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశాలు ఉండటంతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ మేరకు అనకున్నదానికంటే వారం రోజుల ముందే అంటే అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

  English summary
  
 The climax of pawan kalyan’s “cameraman gangatho rambabu” shot would be as similar as “Tagore” as the hero would act with thousands of fans around him. For this Puri would make an audition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X