‘గబ్బర్‌సింగ్’-2: సీక్వెల్ కాదు మరి?
హైదరాబాద్ : త్రివిక్రమ్ తో చేస్తున్న అత్తారింటికి దారేది' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేఫధ్యంలో పవన్ నెక్ట్స్ సినిమా పైనే అందరి ఆలోచన. అయితే పవన్ ఇప్పటికే ఆ చిత్రం ప్రకటించే ఉన్నారు. రామ్‌చరణ్‌తో బాక్సాఫీస్ వద్ద 'రచ్చ' చేసిన సంపత్‌నంది దర్శకత్వంలో ఆయన నటించనున్నారని చెప్పేసారు. అదీ 'గబ్బర్‌సింగ్'-2 అని అన్నారు.
'గబ్బర్‌సింగ్'-2 అనగానే అంతా ఈ చిత్రం సీక్వెల్ అని భావిస్తున్నారు. 'గబ్బర్‌సింగ్' చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను పరిగణిస్తూ ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. కాగా, ఇది 'గబ్బర్‌సింగ్'కు సీక్వెల్, ప్రీక్వెల్ కాదని తెలిసింది. ఒక్క పవన్ పాత్ర మినహా 'గబ్బర్‌సింగ్'కు ఈ సినిమాకూ ఎక్కడా పోలిక ఉండదని తెలుస్తోంది.
పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శరత్‌మరార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యింది. ఒక్క హీరోయిన్ మినహా ఇతర పాత్రల ఎంపిక దాదాపు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. 'గబ్బర్‌సింగ్'కి పనిచేసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రాహకుడు జయనన్ విన్సెంట్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications












