»   » మహేష్, పవన్ తర్వాత ఆ హీరోనే టాప్

మహేష్, పవన్ తర్వాత ఆ హీరోనే టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంలో రజనీకాంత్, తెలుగులో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత భారీ స్ధాయిలో రెమ్యునేషన్ తీసుకుంటున్నది మహేష్ అని చెప్తారు. అయితే వీళ్లిద్దరి తర్వాత ఎక్కువ పారితోషికం తీసుకునే హీరో ఎవరంటే విజయ్. అతను రజనీ తర్వాత తమిళ ఇండస్ట్రీని శాసించే స్ధాయికి ఎదిగాడు. అతని రెమ్యునేషన్ సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నాడు. తాజా చిత్రం జిల్లా తో అది 16 కోట్లకు చేరుకుందని వినపడుతోంది.

విజయ్ చేసిన తుపాకి చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరటంతో అతని క్రేజ్ కి అంతేలేకుండా పోయింది. టెర్రరిజం నేఫధ్యంలో తెరకెక్కిన 'తుపాకి' కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది.

'ఇలయ తలబది' ప్రస్తుతం ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో 'తలైవా'లో నటిస్తున్నాడు. అమలాపాల్‌ హీరోయిన్. హీరో విజయ్ ఈ చిత్రంలో ముంబయి దాదాగా కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా ప్రకటించాడు.

దర్శకుడు మాట్లాడుతూ.. 1980లో ముంబయిని గడగడలాడించిన వరదరాజ ముదలియార్‌ అనే వ్యక్తి జీవిత చరిత్రకు దగ్గరి పోలికలతో హీరో పాత్ర సాగుతుంది. భిన్నమైన రూపంతో కనిపిస్తాడు. తెలుపు వస్త్రాలతో చూపించనున్నాము అన్నారు.

అలాగే హైలెట్స్ వివరిస్తూ...'తలైవా తలైవా సరిత్తరం ఎళుదు' అనే పాట హైలెట్‌గా ఉంటుంది. ఇందులో 500 మంది డ్యాన్సర్లతో విజయ్‌ అద్భుతంగా అడుగులేశాడు.

అన్ని పనులు పూర్తి చేసి విజయ్‌ పుట్టినరోజు కానుకగా జూన్‌ 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌.

English summary
Tamil Hero Vijay reached highest remuneration after pawan and Mahesh. Vijay is the leading actor and giving successful film, his many films remade in other languages in India, his present salary is 16 Crores for Yohan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu