»   » ‘పులి’ ఫంక్షన్ కి చిరు, చరణ్, బన్ని డుమ్మా..ఎందుకంటే..?

‘పులి’ ఫంక్షన్ కి చిరు, చరణ్, బన్ని డుమ్మా..ఎందుకంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొమరం పులి ఆడియోకి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ గైర్హాజరు కావడంతో పలువురిలో చర్చనీయాంశమైంది. దాదాపుగా తమ కుటుంబ సభ్యులకు సంబందించిన సినిమా ఫంక్షన్స్ లో అందరు పాల్గొంటారు. కాని ఈ వేడుకకు వీరు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం ఆడియో మెగాభిమానుల మద్య ఎంతో గ్రాండ్ గా జరిగింది.

ఈ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి రాకపోవడంతో తమ ఫ్యాన్ప్ కొంతమంది నిరుత్సాహపడ్డారు. ఈ నిరుత్సాహాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి ఈ ఫంక్షన్ కి ఎందుకు రాలేదో గల కారణాన్ని వివరించారు..ఈ ఫంక్షన్ ను ఈ రోజు(11.07.10) కాకుండా ఇంకాస్త ముందుగా ఏర్పాటు చేసి ఉంటే అన్నయ్య (చిరంజీవి) కూడా వచ్చి ఉండేవారు. ఈ రోజు తను వేరే ఊళ్లో ఉండటం వల్ల రాలేకపోయాడు. అలాగా రామ్ చరణ్, బన్నీ కూడా వారి వారి షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెప్పారు. పసి వయస్సులో తల్లిదండ్రుల చేయి పట్టుకుని నడిచాను. కాస్త ఊహ వచ్చాక అన్నయ్య బాట చూపించాడు. ఇప్పుడు అన్నయ్య ఇచ్చిన దైర్యంతో మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను అని పవన్ తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu